TSPSC: పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను వెబ్ సైట్‌లో సర్వీస్ కమిషన్ పెట్టింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తరవాత వెబ్ సైట్‌లో సర్వీస్ కమిషన్ పెట్టనుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టులకు, సాంకేతిక, ఇంటర్ విద్యలో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐతే ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం సాధ్యమైనన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారిత (సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు కూడా సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలు నిర్వహించింది. ఆ పరీక్షల ఫలితాలను నేడు విడుదల చేసింది సర్వీస్ కమిషన్.
Read Also: Revanth Reddy: భద్రాద్రి రామయ్య సాక్షిగా హామీ ఇస్తున్నా.. ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తా..