Site icon NTV Telugu

Uttara Pradesh: పాపం.. పెళ్లి కొడుకును చెట్టుకు కట్టేసిన వధువు బంధువులు

Up Bride

Up Bride

అయ్యో పాపం కొత్త పెళ్లి కొడుకును పట్టుకుని చెట్టుకు కట్టేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అయితే ఓ అమాయకుడు పెళ్లి రోజే భార్యాబాధితుడిగా మారిపోయాడు. పెళ్లి సందర్భంగా వధూవరులు ఒకరికొకరు పూలమాలలు వేసుకున్నాక ఏం చేయాలో తోచని వరుడు కట్నం అడగటంతో కోపంతో కొత్త అల్లుడు అని కూడా చూడకుండా వధువు వర్గీయులు అందరు కలిసి కొత్త పెళ్లికొడుకుని చెట్టుకు కట్టేశారు.

Also Read: Sai Pallavi : విరాటపర్వం సినిమా పై ఆసక్తి కర పోస్ట్ చేసిన సాయిపల్లవి..

ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రెసెంట్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో పెళ్లికొడుకుని వధువు వర్గం వారు చెట్టుకి కట్టేసి గుణపాఠం చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఘటనాస్థలానికి పోలీసులు వచ్చేవరకు కూడా సదరు పెళ్లి కొడుకుని అలాగే చెట్టుకు కట్టేసి ఉంచారు. అది చూసిన అతని తల్లిదండ్రులు వధువు వర్గం బంధవులతో వాగ్వాదానికి దిగారు.

Also Read: Telangana : ఖమ్మంలో ఘోర ప్రమాదం..కాళ్ల పారాణి ఆరకముందే కబలించిన మృత్యువు..

అయితే వరుడి స్నేహితులు వధువు బంధువులతో తప్పుగా ప్రవర్తించడం వల్లే గొడవ మొదలైందని.. ఇంతలో వరుడు కట్నం గురించి ఆడిగాడని స్థానికులు చెప్పుకొచ్చారు. పెళ్లి కొడుకు కట్నం గురించి మాట్లాడటంతో కోపం తెచ్చుకున్న ఆడ పిల్లవారు చెట్టుకు కట్టేశారని వారు తెలిపారు. ఇదిలా ఉండగా వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. నీకు పిల్ల దొరకడే కష్టం, కట్నం అవసరమా..?’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. పాపం.. కట్నం కోసం పోయిపోయి పెళ్లి రోజే కాళ్లబేరానికి పోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన పలువురు కామెంట్ బాక్స్ లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Exit mobile version