NTV Telugu Site icon

Godavari River : భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి

Godavari

Godavari

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి వచ్చిన గోదావరి వరద తో భద్రాచలం మీదుగా పోలవరం మీదుగా ధవలేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తుంది .ఈ నేపథ్యంలో గత వారం రోజులు బట్టి భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతూ తగ్గుతూ వస్తున్నది. ఈనెల 23 వ తేది నాడు 51.5 అడుగులకి చేరుకున్నది .భద్రాద్రి గోదావరి నీటిమట్టం ఆ తర్వాత 44 అడుగుల తగ్గింది .అయితే మళ్లీ ఎగువ నుంచి వచ్చిన వరద వల్ల గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సిన వచ్చింది. 53.9 అడుగులకి పెరిగిన గోదావరి ఆ తర్వాత తగ్గుముఖం పట్టడం ప్రారంభించింది . 24 గంటల వ్యవధి లో ఆరు అడుగుల మేరకు గోదావరి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నలభై ఏడు అడుగుల వద్ద ఉన్నది.

Prakasam: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి తృటిలో తప్పిన ప్రమాదం..
దీంతో మూడవ ప్రమాద , రెండో ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించు కున్నారు .ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొన సాగుతుంది .43 అడుగుల వద్ద నుంచి మొదటి ప్రమాదం కొనసాగుతుంది. కాగా భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ కాలనీలో కి నీళ్లు వచ్చాయి. ఇక్కడ ఉన్న తూమ్ లు పని చేయకపోవడం వల్ల పక్కనే ఉన్న వాగు అదే విధంగా డ్రైనేజీ వాటర్ అంతా కూడా కాలనీలోకి ఎంటర్ అయ్యాయి. దీంతో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి పునరావాస కేంద్రానికి బాధిత కుటుంబీకులను తరలించారు. అయితే భద్రాచలంలో గోదావరిలో పూర్తిస్థాయిలో నీటిమట్టం తగ్గుతూనే ఇక్కడ కాలనీలోకి వచ్చిన నీళ్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. లేదా మోటార్లతో ఎత్తిపోయాల్సిన పరిస్థితి .అయితే ఇప్పటికిప్పుడు మోటార్లతో ఎత్తిపోయటం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది .దీంతో కాలనీవాసులు పునరావస కేంద్రంలోని ఉండాల్సిన పరిస్థితి.

Modi-Manu Bhakar: మను భాకర్ కు ప్రధాని ఫోన్.. ఏమన్నారంటే..?

Show comments