Site icon NTV Telugu

The Raja Saab : డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..ది రాజాసాబ్’ రిలీజ్ ట్రైలర్ అప్‌డేట్.. !

Rajasab

Rajasab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ ఒకటి. ఈ మూవీ విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ జోనర్‌ మూవీలో.. ప్రభాస్ సరసన అందాల భామలు మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ‘రాజాసాబ్’ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ చేస్తున్న నిరీక్షణకు నేటితో తెరపడనుంది..

Also Read :Lenin: అఖిల్ ‘లెనిన్’.. అవుట్‌పుట్‌ పై నిర్మాత కాన్ఫిడెంట్ కామెంట్స్

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. వాస్తవానికి ఈ ‘రిలీజ్ ట్రైలర్’ నిన్ననే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. అయితే, ట్రైలర్ ఈరోజే విడుదలవుతుందని చిత్ర బృందం స్పష్టం చేస్తూ, అధికారిక ప్రకటన కోసం సిద్ధంగా ఉండమని అభిమానులను కోరింది.కాగా ట్రైలర్‌లోని కట్స్ మరియు విజువల్స్ చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. హారర్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రభాస్ వింటేజ్ లుక్ మరియు కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సంక్రాంతి రేసులో రాజాసాబ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Exit mobile version