Site icon NTV Telugu

The Rajasaab : ఓటీటీలో బయటపడుతున్న రాజాసాబ్‌ లోపాలు..హీరోయిన్‌కి కూడా డూప్ వాడారా?

Malavika Mohan Rajasab

Malavika Mohan Rajasab

డార్లింగ్ ప్రభాస్‌ నటించిన ‘రాజాసాబ్’ మూవీ ఎలాంటి టాక్ అందుకుందో మనకు తెలిసిందే. డైరెక్టర్ మారుతి ప్రభాస్‌ను సరిగ్గా చూపించలేదని ఫ్యాన్స్ ఇప్పటికే గుర్రు మంటున్నారు. ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ వాడిన డూప్ షాట్లు, గడ్డం విషయంలో వచ్చిన తేడాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయి. ఇప్పుడు వీటికి తోడు హీరోయిన్‌కు కూడా డూప్ వాడారనే విషయం బయటకు రావడం మరింత దుమారం రేపుతోంది. ఈ సినిమాలో విలన్ గ్యాంగ్‌లో నటించిన రోన్సన్ విన్సెంట్ అనే నటుడు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఈ వివాదానికి కారణమైంది. తాను హీరో, హీరోయిన్లతో ఫోటోలు దిగడం కష్టం కాబట్టి, వారి డూప్‌లతో ఫోటోలు దిగి సంతృప్తి చెందుతానంటూ మాళవిక మోహనన్ డూప్‌తో దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. దీంతో,

Also Read : Rukmini : రష్మికలాగే.. రుక్మిణికి కూడా కన్నడిగుల విమర్శలు తప్పవా?

“హీరోయిన్ చేసే చిన్నపాటి ఫైట్ సీన్లకు కూడా డూప్‌ను వాడేశారా?” అంటూ నెటిజన్లు మారుతిపై విరుచుకుపడుతున్నారు. సినిమా రిజల్ట్ పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత కోపంగా ఉన్నారంటే, మారుతిని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తున్నారు. ఆయన పేరు మీద వందలాది స్విగ్గీ, జొమాటో ఆర్డర్లను ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పద్ధతిలో బుక్ చేసి వేధిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయన కొద్దిరోజులుగా ఇంటి నుంచే బయటకు రావడం లేదట. ఓటీటీలో సినిమా చూస్తున్న నెటిజన్లు.. వీఎఫ్ఎక్స్ లోపాలు, లాజిక్ లేని సీన్లను స్క్రీన్ షాట్లు తీసి మారుతిని ట్యాగ్ చేస్తూ ఆడుకుంటున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వంటి హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే వాడారని, కంటెంట్ విషయంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యారని విమర్శకులు మండిపడుతున్నారు. ఈ వివాదంపై చిత్ర యూనిట్ మౌనం పాటిస్తుండటం గమనార్హం.

Exit mobile version