రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచేసింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక సరికొత్త రొమాంటిక్ హారర్ కామెడీగా.. 2026 కొత్త సంవత్సరం కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన మొదటి పాట ‘రెబల్ సాబ్’ ఇప్పటికే అభిమానుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేయగా, త్వరలోనే రెండో పాటను రిలీజ్ చేసి మరింత జోష్ పెంచనున్నారు.
Also Read : Dhurandhar: హృతిక్ వ్యాఖ్యలపై దర్శకుడు స్పందన.. ‘ధురంధర్ పార్ట్ 2’పై క్లారిటీ ఇచ్చిన ఆదిత్య ధర్
అయితే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ జోరు నార్త్ అమెరికాలో ఇప్పటికే మొదలైంది. విడుదలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం ఉన్నప్పటికీ, ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 100K డాలర్ల (సుమారు 83 లక్షల రూపాయలు)కు పైగా వసూళ్లు సాధించడం నిజంగా అసాధారణం. ఈ లెక్కలు చూస్తుంటే, అమెరికాలో ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ప్రమోషన్ కార్యక్రమాలు మరింత బలంగా జరిగితే, ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం మరింత ఊపు తెచ్చుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ వంటి ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వస్తున్న ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
