Site icon NTV Telugu

Prabhas : రెండు పాత్రలు.. మూడు గెటప్ లు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్

The Rajasaab Motion Poster

The Rajasaab Motion Poster

Prabhas : ఇటీవల కాలంలో కాస్త స్టార్ డమ్ ఉన్న హీరోల దగ్గర్నుంచి చిన్న హీరోల వరకు ప్రయోగాలు చేస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా తమ పాత్రలు ఉండాలని డైరెక్టర్లకు, నిర్మాతలకు సూచిస్తున్నారు. అలా కొందరు పాన్ ఇండియా రేంజ్ హీరోలు డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారి జాబితాలో ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా చేరిపోయాడు. సాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత మరింత దూకుడుగా వెళ్తున్నారు. ఒకే సమయంలో నాలుగైదు ప్రాజెక్టులను చేస్తూ షాక్ ఇస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు నటిస్తోన్న చిత్రాల్లో మారతి దర్శకత్వంలో చేస్తున్న ‘ది రాజా సాబ్’ ఒకటి. ఇప్పటి దాకా చిన్న చిత్రాలను చేసే మారుతి.. ప్రస్తుతం ఏకంగా స్టార్ హీరో అయి ప్రభాస్ ను డైరెక్ట్ చేయడం ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రభాస్ గతంలో ఎన్నడూ టచ్ చేయని హర్రర్ కామెడీ జోనర్‌లో రూపొందిస్తోన్నారు. దీంతో ఈ చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read Also:Drugs Seized: మరోసారి డ్రగ్స్‌ కలకలం.. రూ.25 లక్షల విలువచేసే MDMA స్వాధీనం

‘ది రాజా సాబ్’ సినిమా నుంచి ఒకదాని వెంట ఒకటి అప్‌డేట్లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం నుంచి ఎన్నో రకాల పోస్టర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్‌ను వదిలారు. ఇందులో రెబెల్ స్టార్ ఎవరూ ఊహించని గెటప్ లో కనిపించారు. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ట్రెండింగులో నంబర్ 1గా నిలిచింది. ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి ఇప్పటికే ఎన్నో లీక్ అయ్యాయి. ముఖ్యంగా ఇందులో అతడు ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో ప్రభాస్ రెండు పాత్రలు చేస్తున్నప్పటికీ.. మూడు రూపాల్లో కనిపిస్తాడట.

Read Also:Gold Rate Today: సంతోషం ఒక్కరోజే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు! కానీ మరో శుభవార్త

ఓ పాత్రలో ప్రభాస్ వృద్ధుడిగా కనిపించనున్నట్లు తాజాగా వచ్చిన మోషన్ పోస్టర్ ద్వారా తెలిసింది. దీనితో పాటు అతడి మనవడి రోల్ కూడా చేస్తున్నాడట. ఈ రెండు మాత్రమే కాకుండా ఆత్మగా రెబెల్ స్టార్ మరో పాత్రను కూడా చేస్తున్నాడని తాజాగా మరో గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. అంటే.. ఇందులో ప్రభాస్ మూడు భిన్నమైన గెటప్‌లతో కనిపించబోతున్నాడట. అయితే, మూడు గెటప్‌లు ఉన్నా అతడు చేసేది రెండు పాత్రలే అన్న టాక్ కూడా ఒకటి వినిపిస్తోంది.

Exit mobile version