రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది రాజాసాబ్’ సందడి మొదలైంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘సహనా.. సహనా..’ అనే మెలోడీ సాంగ్‌ను విడుదల చేసిన సందర్భంగా చిత్ర యూనిట్ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ ఎప్పుడూ తన అభిమానుల గురించే ఆలోచిస్తుంటారు. వారిని ఎలా అలరించాలి, వారికి ఎలాంటి వినోదాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎంతో శ్రమిస్తారు. ఈ సంక్రాంతికి రాజాసాబ్‌తో ఫ్యాన్స్ అందరికీ పండగే’ అని ధీమా వ్యక్తం చేశారు. ఇక
Also Read :Raju weds Rambhai : ఓటీటీలోకి వచ్చేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 9న విడుదల కానుండగా, అంతకంటే ముందే అంటే జనవరి 8 నుంచే ప్రీమియర్ షోలతో రచ్చ మొదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే త్వరలోనే నిర్వహించబోయే భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ స్వయంగా హాజరవుతారని తెలిపారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. సినిమాలో ఇంకా రెండు పాటలు ఉన్నాయని, అందులో ఒక పాటలో ముగ్గురు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్‌లతో కలిసి ప్రభాస్ వేసిన స్టెప్పులు థియేటర్లను షేక్ చేస్తాయని హింట్ ఇచ్చారు. హారర్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.