The Raja Saab Final Runtime: రెబల్ స్టార్ ‘ప్రభాస్’ నటించిన హార్రర్ ఫాంటసీ మూవీ ‘ది రాజాసాబ్’. ఈ చిత్రం వచ్చే వారమే థియేటర్లోకి రాబోతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ముందు రోజే ప్రీమియర్స్ షోస్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు.
మరోవైపు రాజాసాబ్ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ మూవీకి U/A సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలిసింది. అలాగే ఈ సినిమా రన్ టైం కూడా రివీల్ అయింది. 183 నిమిషాలు అంటే.. మూడు గంటల మూడు నిమిషాల రన్ టైంతో రానున్నట్టుగా తెలిసింది. కానీ ఇప్పుడు రన్ టైం కాస్త తగ్గినట్టుగా తెలుస్తోంది. సెన్సార్ కట్స్ తర్వాత ఫైనల్‌గా రెండు గంటల 55 నిమిషాలు లాక్ చేసినట్టుగా సమాచారం. అంటే రాజాసాబ్ రన్ టైం మూడు గంటల లోపే అన్నమాట. ఈ రన్ టైం సినిమాకు కలిసొచ్చే అంశమే అని చెప్పాలి.
ఇక ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లో రొమాన్స్ చేస్తున్నాడు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రాజాసాబ్ నుంచి మూడు సాంగ్స్ రిలీజ్ కాగా.. త్వరలోనే మరో సాంగ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మరి ఈ సంక్రాంతికి రాజాసాబ్ ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి.
