NTV Telugu Site icon

Caste Census: ఏపీలో రేపటి నుంచి కుల గణన.. 5 ప్రాంతాల్లో ప్రారంభం..

Ap Govt

Ap Govt

ఏపీలో రేపటి నుంచి కుల గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణన స్టార్ట్ చేయనున్నారు. 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో మొదలు కానుంది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కుల గణన జరుగనుంది. రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా కులగణన చేపట్టనున్నారు. కుల గణనపై ఈ నెల 22 వరకు శిక్షణ.. రేపటి నుంచి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగనున్నాయి. ఐదు పట్టణాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలుతో పాటు 20వ తారీఖున విజయవాడ, విశాఖపట్నంలో ఇక, 24న తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు.

Read Also: Ghost : శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

అలాగే, ఏపీలో స‌మ‌గ్ర కుల‌గ‌ణ‌న కోసం గత 8 నెల‌లుగా జగన్ సర్కార్ అధ్యయనం చేస్తుంది. దీని కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రణాళిక, సచివాలయాల శాఖల ముఖ్యకార్యదర్శలతో జగన్ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఆరుగురు అధికారుల క‌మిటీ దేశంలో కుల‌గ‌ణ‌న చేప‌ట్టిన రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో పర్యటించారు. అక్కడ న్యాయపరంగా వస్తున్న ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకుంది. అయితే, కుల‌గ‌ణ‌న ఎలా చేప‌ట్టాలి.. ఎలాంటి సమాచారం తీసుకోవాలనే అంశాలతో ఈ కమిటీ ప్రభుత్వానికి ఓ రిపోర్ట్ ఇచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఉన్న సుమారు కోటీ 60 లక్షల కుటుంబాలను ప్రభుత్వం సర్వే చేయనుంది. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి డేటా సేక‌రించ‌నున్నారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్ ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సమాచారం మొత్తం యాప్‌లోనే డిజిటల్ విధానంలో అప్ లోడ్ చేయనున్నారు.