Lee Hsien Loong: ఐఐటీ, ఐఐఎంను మెచ్చుకున్న సింగపూర్ ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగపూర్ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ భారతీయ ప్రతిభను మెచ్చుకున్నారు. భారత్ లోని ఐఐటీ(IIT), ఐఐఎం(IIM)ని ప్రశంసించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన 20 ఏళ్ల ప్రధానమంత్రి పదవీకాలం గురించి చర్చించారు. సింగపూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కోసం వెతుకుతోందని పీఎం లీ సీన్ లూంగ్ అన్నారు. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) అత్యధిక సంఖ్యలో గ్రాడ్యుయేట్లను కలిగి ఉందన్నారు. ఆయన మే 15న తన పదవిని వదులుకోనున్నారు. తన డిప్యూటీ లారెన్స్ వాంగ్‌కు పగ్గాలు అప్పగించే ముందు లీ విస్తృత ఇంటర్వ్యూలో తన 20 ఏళ్ల ప్రధానమంత్రి పదవీకాలాన్ని వివరించారు.
READ MORE: Arunachal Pradesh: అంతరాష్ట్ర వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. నలుగురు మైనర్లు సేఫ్
Also Read
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
- SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్‌కు కాటేరమ్మ కొడుకు దూరం..
IIT-IIMని స్టాన్ఫోర్డ్-హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో పోల్చారు. అవి భారతదేశంలోని టాప్ ఇన్స్టిట్యూట్లని, వాటిలో స్థానం సంపాదించడం మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొందడంతో సమానమని చెప్పారు. అక్కడి ప్రొఫెషనల్స్ సింగపూర్‌లో అసోసియేషన్లు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు ఫంక్షన్లు నిర్వహిస్తున్నారన్నారు. భారత్ కి చెందిన కార్మికుల సంఘం గురించి ప్రస్తావిస్తూ.. సింగపూర్ వాసులు భారత్ కార్మికుల రాకపై శ్రద్ధ చూపుతున్నారన్నారు. సింగపూర్ సిబ్బందికి ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా విదేశీ టాలెంట్లను తీసుకురావడాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. సింగపూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కోసం శోధిస్తుందని.. చైనా, భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక ఇతర ఆగ్నేయాసియా దేశాలు, ముఖ్యంగా పొరుగున ఉన్న మలేషియా, ప్రధాన వనరులని స్పష్టం చేశారు.
- Tags
- IIM
- IIT
- india
- Lee Hsien Loong
- modi
తాజావార్తలు
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
-
Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
-
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్‌కు కాటేరమ్మ కొడుకు దూరం..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!