Site icon NTV Telugu

Tomato Price: అక్కడ టమాటా ధర కిలో రూ.250.. బెంబేలెత్తుతున్న జనాలు..!

Tomato

Tomato

గత నెల రోజులుగా టమాటా ధర విపరీతంగా పెరుగుతుంది. దీంతో టమాట కొనడమే మానేస్తున్నారు జనాలు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న టమాటా ధరలు రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మరోవైపు టమాటతోపాటు ఇతర కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో టమాటా ధరలు రికార్డు స్థాయిలో కిలో రూ.200 దాటాయి. గంగోత్రి ధామ్‌లో అయితే టమాటా కిలో రూ.250కి విక్రయిస్తున్నారు.

Pawan Kalyan: ‘వారాహి’ కష్టం వృథా కాదు.. వచ్చే ఎన్నికల్లో బలమైన ముద్ర..

భారీ వర్షాలు, కూరగాయలు సరఫరా లేకపోవడంతో టమాటా ధర పెరగడానికి కారణమని వ్యాపారస్తులు చెబుతున్నారు. మరోవైపు నిత్యం పెరుగుతున్న కూరగాయల ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక రోజు ముందు విడుదల చేసిన వివరాల ప్రకారం.. యూపీలోని షాజహాన్‌పూర్‌లో టొమాటో రూ.162కి విక్రయించబడింది. అయితే రాజస్థాన్‌లోని చురు జిల్లాలో అత్యల్పంగా కిలో రూ.31గా విక్రయించారు.

Delhi Rains: ఢిల్లీలో వర్ష బీభత్సం.. నీట మునిగిన 56 రోడ్లు..!

మరోవైపు టమోటాల అధిక ధర నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి తమిళనాడు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో కిలో రూ.60 చొప్పున టమాటను అందుబాటులో ఉంచుతోంది. చెన్నై, కోయంబత్తూర్‌, సేలం, ఈరోడ్‌, వెల్లూరులోని పన్నై పసుమై (ఫార్మ్‌ ఫ్రెష్‌) షాపుల్లో కిలో రూ.60 చొప్పున టమాటా విక్రయిస్తామని అక్కడి ప్రభుత్వం తెలిపింది.

Carrot Cultivation: క్యారెట్ ను ఇలా సాగు చేస్తే అధిక లాభాలను పొందవచ్చు..

మరోవైపు టమాటా ధర విపరీతంగా పెరిగిపోవడంతో రెస్టారెంట్లు, ఫుడ్ చైన్‌లు సైతం నష్టపోతున్నాయి. ఇటీవల, మెక్‌డొనాల్డ్స్ మరియు బర్గర్ కింగ్‌లు తమ ఉత్పత్తులలో కొన్నింటిలో టమోటాల వాడకాన్ని నిలిపివేసింది. నాణ్యమైన టమోటాలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతుంది. భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని టొమాటోలను మెనూ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు మెక్‌డొనాల్డ్స్ స్పష్టం చేసింది.

Exit mobile version