NTV Telugu Site icon

FIR నమోదు చేయకుంటే ఏం చేయాలో తెలుసా..?

పోలీసులు ఏదైనా సమస్యపై కేసులు నమోదు చేయకుంటే ఎవరిని అడగాలో తెలియదు సామాన్యులకు, కొంచెం డబ్బు, అధికారం పలు కుబడి ఉన్నవారు తమపై దాడులకు దిగిన ఇతర నేరారోపణలు ఉన్న తమపై పోలీసులు కేసు తీసుకోకుంటే ఏం చేయాలో సామాన్యు లకు పాలుపోదు. పోలీసులు ఏదైనా నేరానికి సంబంధించి సమా చారం తెలిస్తే FIR నమోదు చేస్తారు. FIR ఫస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టు. ఎఫ్‌ఐఆర్‌లో తేది, ఫిర్యాదు ఇచ్చిన వారిపేరు, సమయం, సెక్షన్లు, నేరం, ఫిర్యాదు ఎవరి పేరున నమోదైందో వారి వివరాలతో పాటు తది తర విషయాలు ఉంటాయి. సామాన్యులపై పలుకుబడి ఉన్న వారు తప్పు చేస్తే సామాన్యుడు కేసు పెడితే కేసు నమోదుకు పోలీసులు కేసు నమో దుకు వెనుకడుగు వేస్తుంటారు. మాట్లాడుకుని పరిష్కారం చేసుకోవాలని సూచిస్తారు. ఆ సమయంలో పోలీసులపై ఫిర్యాదు చేసే అవకాశం భారత రాజ్యంంగలోని చట్టాలు కల్పించాయి.

స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ మీ ఫిర్యాదును తీసుకుని వారంలో FIR(CRPC SEC 154) ప్రకారం కేసు నమోదు చేయకపోతే ఆ ఫిర్యాదు కాపీని రిజస్టర్‌ పోస్ట్‌ విత్‌ అక్‌నాలెడ్జిమెంట్‌తో జిల్లా SP/CPకి CRPC SEC S0/154 (3) ప్రకారం పంపాలి. CRPC SEC 36 ప్రకారం అధికారం ఉంది. SP/CP గారే FIR(CRPC 154) నమోదు చెయ్యాలి. ఒక వేళ వారు కూడా కేసు నమోదు చేయకుంటే SHO, SPగారి మీద మేజి స్ట్రేట్‌ కోర్టులో CRPC 190,200 ప్రకారం ప్రైవేట్ ఫిర్యాదు చేయాలి.

ఆ ఫిర్యాదులో SHO,SP మీద IPC166, 166A, 217 ప్రకారం క్రిమి నల్‌ ఛార్జస్‌ అభియోగాలు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు ఇవ్వాలి. దీని ద్వారా న్యాయమూర్తి కేసు విచారించ దగినదయితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారించాలని పోలీస్‌ శాఖను ఆదేశిస్తారు. కేసు నమోదు చేయని పోలీసులపై శాఖపరమైన చర్యలతో పాటు, జైలు శిక్ష విధించే అవకాశం న్యాయమూర్తికి ఉంటుంది.