NTV Telugu Site icon

Rajasthan:సైనికుడిని స్టేషన్‌లో బట్టలు విప్పి కొట్టిన పోలీసులు.. మంత్రి ఫైర్

Rajasthan

Rajasthan

రాజస్థాన్ లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జైపూర్‌లోని షిప్రాపత్ పోలీస్ స్టేషన్‌లో ఆర్మీ జవాన్‌తో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో క్యాబినెట్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ సంఘటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. పోలీసు స్టేషన్ సిబ్బందిని మందలించారు. పోలీసులు చట్టాన్ని అడ్డుపెట్టుకుని అనుచితంగా ప్రవర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చాయన్నారు. స్టేషన్ కు చేరుకుని పోలీసులను హెచ్చరించారు.

READ MORE: AP CM Chandrababu: స్కూల్ వ్యాన్‌ల ఫిట్ నెస్ పరీక్షలకు సీఎం చంద్రబాబు ఆదేశం

అసలేం జరిగిందంటే.. జమ్మూ కాశ్మీర్‌లో కమాండోగా నియమించబడిన అరవింద్ సింగ్ రాజ్‌పుత్ తనకు తెలిసిన వారి కేసుకు సంబంధించి నగరంలోని షిప్రాపత్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. బట్టలు సైతం తొలగించారని బాధితుడు ఆరోపించారు. బాధిత సైనికుడు వీడియో కూడా బయటకు వచ్చింది. వీడియోలో సైనికుడు మాట్లాడుతూ.. “నా స్నేహితుడు రాజ్‌వీర్ షెకావత్ ఆగస్టు 11వ తేదీ రాత్రి తన స్నేహితులతో పార్టీకి వెళ్లాడు. వైన్ క్లబ్‌పై పోలీసులు దాడి చేశారు. అతన్ని షిప్రాపాత్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్లాను. అరెస్టుకు గల కారణాలను అడిగితే నాపై అసభ్యకరంగా ప్రవర్తించారు. నన్ను బట్టలు విప్పి రిమాండ్ రూమ్‌కి తీసుకెళ్లి కొట్టారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

READ MORE:Jharkhand: ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డును చంపి పరారైన అత్యాచార దోషి..

ఈ ఘటన జరిగిన వెంటనే కేబినెట్‌ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ డీజీపీ, పోలీస్‌ కమిషనర్‌తో మాట్లాడి సీరియస్‌గా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఘటనలో పాల్గొన్న ఐదుగురు పోలీసుల మానసిక స్థితిని పరిశీలిస్తామని మంత్రి రాథోడ్ తెలిపారు. పోలీసుల తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘సైనికుడు ఏదో పని కోసం ఇక్కడకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు బట్టలు విప్పి మరి లాఠీలతో కొట్టారు. ఐదుగురు పోలీసులు కలిసి సైనికుడిపై దాడి చేయడం బాధకరం. సైనికుడి మెడికల్ రిపోర్టు చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు కూడా యూనిఫారాన్ని గౌరవిస్తాను. ఇలా రౌడీయిజం చేసే హక్కు రాజ్యాంగం ఎవరికీ ఇవ్వలేదు.” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.