Jewellery Robbery : 24 గంటల్లో జ్యువెలరీ షాప్ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడ్చల్‌లో జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును మేడ్చల్ పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితులను పట్టుకున్నారు. జగదాంబ జ్యువెలరీ షాప్‌లో మాస్క్, బుర్ఖా ధరించి యజమానిని కత్తితో పొడిచి డబ్బు ఎత్తుకెళ్లారు దుండగులు. సిసి కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు పోలీసులు. సైబరాబాద్ సీపీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహతి మీడియా మాట్లాడుతూ.. మేడ్చల్ లో జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును ఛేదించామని తెలిపారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేశామని, జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేయడానికి విఫల యత్నం చేశారని ఆయన పేర్కొన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసాము మరొకరు పరార్ అయ్యారని తెలిపారు. అనంతరం మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్‌లోని ఓ నగల దుకాణంలో చోరీకి నిందితులు విఫలయత్నం చేశారని, ఇద్దరు నిందితులు జువెలరీ షాప్ లోకి చొరబడ్డారు. ఆ క్రమంలో షాప్ ఓనర్స్ ను చంపడానికి కూడా వెనకాడ లేదన్నారు. రాబరికి పాల్పడుతున్న సమయంలో షాప్ ఓనర్ కేకలు పెట్టారని, వారి మీద దాడి చేసి నిందితులు పరారయ్యారు.. ఈ కేసులో ముగ్గురి భాగస్వామ్యం ఉందని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.
ఈ కేసులో నిందితులు హైదరాబాద్‌కు సంబంధించిన వారేనని ఆయన తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు నజీమ్ అజీజ్ కొటాడియా.. షేక్ సోహెల్.. అని, నిందితులు రాబరికోసం చోరీ చేసిన బైక్‌ను వినియోగించారని తెలిపారు. నిందితులు బైక్ను ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చేశారని, చోరీ చేయడానికి ముందు నిందితులు మూడుసార్లు రెక్కీ నిర్వహించారన్నారు. సుమారు పదిచోట్ల రెక్కీ నిర్వహించి మేడ్చల్లో దోపిడీకి యత్నించారని, నిందితులను పట్టుకోవడం కోసం సుమా 200 సిసి కెమెరాలు జల్లెడ పట్టామని పేర్కొన్నారు. బైక్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినప్పుడు చోరీ చేసిన బైక్ గా గుర్తించామని, ఇటీవల చాధర్ ఘాట్ లో జరిగిన చోరీ నిందితుడు కోటడియా పాత్ర ఉందన్నారు. ముందుగా కోటాడియా అరెస్ట్ చేసాం.. అతని ద్వారా షేక్ సోహెల్ అరెస్ట్ చేసామని, ఇద్దరికీ జైలులో పరిచయం ఏర్పడిందన్నారు. ఇద్దరు నిందితులకి సహకరించిన మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడని డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు.
Also Read
- Amaravati Unstoppable: అమరావతి రాజధాని అన్‌స్టాపబుల్.. ఎవరూ అడ్డుకోలేరు..
- Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
- Harbhajan Singh: "అస్సలు భయపడొద్దు".. వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే ‘డేంజరస్ గేమ్ ప్లాన్’ చెప్పిన హర్భజన్ సింగ్..
- Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
తాజావార్తలు
-
I Am Game Release Date: ఆగస్టు 20 కాదు… దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్
-
Amaravati Unstoppable: అమరావతి రాజధాని అన్‌స్టాపబుల్.. ఎవరూ అడ్డుకోలేరు..
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Harbhajan Singh: “అస్సలు భయపడొద్దు”.. వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే ‘డేంజరస్ గేమ్ ప్లాన్’ చెప్పిన హర్భజన్ సింగ్..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలి?.. మాస్టర్ ప్లాన్ చెప్పిన హర్భజన్ సింగ్!
ట్రెండింగ్
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!