NTV Telugu Site icon

Viral Video: ప్రవహిస్తున్న వరదలో కారు నడిపిన వ్యక్తి.. వీడియో వైరల్..!

Car

Car

సాధారణంగా డ్రైవర్లు రోడ్లపైనే వాహనాలు నడపుతారు. వర్షాకాలం వచ్చిందంటే రోడ్లపైనే వర్షపు నీరు భారీగా చేరి ఉంటుంది. కొన్నిచోట్ల రోడ్ డ్యామ్ లపై వరద నీరు వెళ్తుంటే.. అందులో నుంచి వెళ్లడానికి డ్రైవర్లు సాహసం చేయరు. ఎందుకంటే అందులో చిక్కుకుంటే.. వాహనాలతో పాటు అందులో ఉన్న మనుషులు కూడా కొట్టుకుపోతారు కనుక అంత డేర్ చేసేందుకు భయపడుతారు డ్రైవర్లు. ఐతే ఈ వీడియోలో ఓ డ్రైవర్ నడిపే డ్రైవింగ్ చూస్తే.. ఒక్కసారిగా షాకవుతారు. ఇంతకీ వీడియోలో ఏముందంటే..

Pilli Subhash Chandra Bose: బీసీ కుల గణనపై కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదు

వర్షాకాలం రాగానే దేశంలోని నలుమూలలు భారీ వరదల విధ్వంసం కొనసాగుతుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల్లో ప్రజల ఇళ్లు కొట్టుకుపోతుంటాయి. అలాంటి భయానక వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి. అయితే అలాంటి ఒక వీడియో ప్రస్తుతం చాలా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ప్రవహించే వరదలో కారు నడుపుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది కొండ ప్రాంతం.. అక్కడ చిన్న పొరపాటు జరిగినా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ వీడియోలో వరదలో నుంచి ఎలా వెళ్తున్నాడో మీరు చూడవచ్చు. ప్రవహిస్తున్న నదిని లెక్కచేయకుండా వాహనాన్ని ముందుకు పోనిస్తున్నాడు. చిన్న పొరపాటు జరిగినా తన పరిస్థితి ఏమవుతుందో అని అస్సలు భయపడడు. ఇలాంటి ప్రమాదకరమైన దారిలో వాహనం నడిపి ముందుకు సాగిన వ్యక్తి ధైర్యాన్ని అభినందించాల్సిందే.

Uttar Pradesh: ప్రభుత్వ ఆఫర్.. అక్కడ సగం రేటుకే టమోటాలు..!

ఈ షాకింగ్ వీడియో @HasnaZarooriHai అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘జీవితంలో ఈ స్థాయి విశ్వాసం అవసరం’ అనే క్యాప్షన్ తో ఉంది. ఈ వీడియోను ఇప్పటివరకు 40 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది లైక్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియో చూసిన తర్వాత.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘డ్రైవర్‌, కారు రెండూ పాటించాల్సిందే’ అని కొందరంటే, ‘నైపుణ్యం కూడా అదే స్థాయిలో ఉండాలి’ అని కొందరు అంటున్నారు. మరొక వినియోగదారు ఇది ‘మిషన్ ఇంపాజిబుల్’ అని పేర్కొన్నారు.