NTV Telugu Site icon

Pawan kalyan: నెల్లూరు ప్రజలు ఇంత ప్రేమ చూపిస్తారను కోలేదు

Pawan

Pawan

నెల్లూరులో ఎంతటి ఉద్వేగాన్ని చూడలేదని.. ఇంత ప్రేమ అభిమానాలను చూపిస్తారని కలలో కూడా అనుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నెల్లూరు జిల్లా సింహ పురిలో ఏర్పాటు చేసిన సింహగర్జన సభలో ఆయన మాట్లాడారు. “తరం మారుతోంది కొత్త తరం వస్తోంది. బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి.. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుంది. మహిళలు. యువత ఇళ్లలో నుంచి బయటికి వచ్చారు. నేను సెయింట్ జోసెఫ్ స్కూల్.. వి ఆర్ కళాశాలలో చదువుకున్నా. అక్కడ దేశభక్తి. తప్పు జరిగితే కొండపల్లి సీతారామయ్య. పుచ్చలపల్లి సుందరయ్య లాగా బయటికి వచ్చి గొంతు విప్పి మాట్లాడడం నేర్చుకున్నా. నెల్లూరులో దర్గామిట్ట. మూలపేట. రంగనాయకులపేట సంతపేటలలో తిరిగా.”

READ MORE: Fake Protein Powder: నకిలీ ప్రోటీన్ పౌడర్లను గుర్తించేదెలా..?

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నారాయణలను భారీ మెజార్టీతో గెలిపించాలని పవన్ కల్యాణ్ ఓటర్లను కోరారు. ఆయన మాట్లాడుతూ.. “గుండా ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదు. గుండె లోతుల్లోంచి అన్యాయానికి ఎదురు తిరిగా. సింహపురి ఇది. నిలబడి.. నిలదొక్కుకుని, అవినీతి కోటలను బద్దలు కొడదాం. నేను అభిమానించే కవి గుంటూరు శేషేంద్ర శర్మ. ఆర్యవైశ్య సమాజానికి సంబంధించి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం రాష్ట్ర దినోత్సవంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు విషయం 2020 విజన్ తో ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2047లో సూపర్ పవర్ కావాలని మోడీ నిర్ణయించారు.”