NTV Telugu Site icon

Kolkata Doctor Murder Case: “మా కూతుర్ని చంపేందుకు ఎవరో సంజయ్‌ని పంపారు”.. బాధితురాలి తల్లి సంచలన వాదనలు

Kolkata Doctor's Rape And Murder Case

Kolkata Doctor's Rape And Murder Case

కోల్‌కతా అత్యాచారం-హత్య కేసులో బాధితురాలు ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు షాకింగ్ వాదనలు చేశారు. తమ కుమార్తెను హత్య చేసేందుకు నిందితుడు సంజయ్‌రాయ్‌ను ఎవరో పంపారని కుటుంబ సభ్యులు తెలిపారు. కోల్‌కతా పోలీసులకు చెందిన సంజయ్ రాయ్‌ను ఆగస్టు 10న అరెస్టు చేశారు. దీనికి ఒక రోజు ముందు.. ఆర్‌జి కర్ హాస్పిటల్‌లోని సెమినార్ హాల్‌లో ట్రైనీ డాక్టర్ సెమీ న్యూడ్ మృతదేహం కనుగొనబడింది. అనంతరం పోస్టుమార్టంలో అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది.

READ MORE: Nani : సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు..ఎక్కడో తెలుసా..?

అయితే ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మృతురాలి తల్లి మాట్లాడుతూ.. “మా కూతురి హత్యకు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మా కూతుర్ని చంపడానికి ఎవరో సంజయ్‌ని పంపించారు. సోషల్ మీడియాలో తమ కూతురు గురించి ఫేక్ న్యూస్ వస్తే సహించలేకపోతున్నాం. ఘటన జరిగిన తర్వాత ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ తనకు ఫోన్ చేసి క్షమాపణలు కూడా చెప్పలేదు. డాక్టర్ సందీప్ ఘోష్ ఎండీ పరీక్షలో ఫెయిల్ అవుతాడని నా కూతురు భయపడింది. ఆయన గురించి నా కుమార్తె మంచి కోరుకుంది. కానీ ఎందుకు అలా చేశాడో తెలియడం లేదు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

READ MORE:Delhi: ఎయిర్‌పోర్టులో గుండెపోటుతో కుప్పకూలిన ప్యాసింజర్.. జవాన్లు ఏం చేశారంటే..!

తన కూతురు మృతదేహాన్ని చూసేందుకు వేచిచూడాలని పోలీసులను, ఆర్జీ కర్ ఆసుపత్రి అధికారులను విమర్శిస్తూ.. ‘ఏదో దాచిపెట్టి మా కూతురు మృతదేహాన్ని చూపించలేదు.. మా కూతురు మొహం చూపించడానికి నాలుగు గంటలు పట్టింది. వారు ఏదో చేద్దామని ప్రయత్నించారు. నా కుమార్తెకు డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ చేయాలని ఉండేది. డీఎం కోసం ప్రిపేర్ కావడానికి పుస్తకాలు తీసుకొచ్చింది.” అని చెప్పారు. ఉద్యోగం పట్ల తనకున్న అంకితభావాన్ని గుర్తు చేసుకుంటూ.. “ఆమె ఎక్కువ సమయం ఆస్పత్రిలో గడిపేది. వచ్చాక కూడా చదువుపైనే ద్యాస పెట్టేది. నాలుగు ఆన్‌లైన్ కోర్సులు కూడా చేసేది. కరోనా మహమ్మారి సమయంలో.. ఆమె వరుసగా నాలుగు రోజులు మునిసిపల్ ఆసుపత్రిలో సేవలు అందించింది.” అని చెప్పుకొచ్చారు.

READ MORE:Fact Check : రాత్రి వేళ మహిళలకు ఫ్రీ జర్నీ.. స్పందించిన పోలీసులు

‘నిరసన చేస్తున్న వారు మా పిల్లలే…’
నా కూతురుకి బంగారు పతకం వస్తుందని ఆమె స్నేహితులు మాతో చెప్పేవారు. కానీ ఇప్పుడు నా కూతురిని కోల్పోయాను. ఇప్పుడు నిరసన తెలుపుతున్న వారంతా నా బిడ్డలే. ఆమె తన పెళ్లి ఖర్చుల కోసం తన తండ్రికి రూ. 5 లక్షలు ఇవ్వాలని కోరింది. ఆమె ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ ఇప్పుడు సీబీఐ వద్ద ఉన్నాయి. ఆమెకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.” అని ఆవేదన వ్యక్తం చేశారు.