The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్సులకు సంబంధించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ‘ది ప్యారడైజ్’ యాక్షన్ సీక్వెన్సులు సాధారణంగా ఉండవని, ‘దసరా’ కంటే డబుల్, ట్రిపుల్ హెవీగా ఉంటాయని మాస్టర్స్ స్పష్టం చేశారు. “టీజర్లో బ్లడ్ ఎక్కువైంది అనుకుంటున్నారు కానీ, సినిమాలో ఏకంగా రెండు మూడు టన్నుల రక్తం కనిపిస్తుంది” అంటూ నవ్వుతూనే సినిమా వైలెన్స్ తీవ్రతను బయటపెట్టారు. సాధారణంగా సినిమాల్లో ఫైట్స్ ఉంటాయి, కానీ ఈ చిత్రంలో ఫైట్ల మధ్యలోనే సినిమా నడుస్తుందని చెప్పారు. రెండు బ్లాక్స్ కంపోజ్ చేయడానికే తమకు 20 రోజుల సమయం పట్టిందని, తమతో పాటు రియల్ సతీష్, నవకాంత్ కూడా యాక్షన్ విభాగంలో పనిచేశారని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో నాని లుక్, బాడీ లాంగ్వేజ్ భారతీయ తెరపై ఇప్పటివరకు రాని విధంగా కొరియన్ సినిమాల తరహాలో డిజైన్ చేశారు. రెండు జడలు వేసుకుని బేర్బాడీతో పోరాడే పాత్ర ఇది. అయితే షర్టు లేకపోవడం వల్ల శరీరానికి రోప్స్ కట్టడానికి ఏమాత్రం వీలులేకుండా పోయిందని, దాంతో నాని డూప్ లేకుండా, రోప్ సపోర్ట్ లేకుండానే రియల్ ఇంపాక్ట్ కోసం స్వయంగా బరిలోకి దిగాల్సి వచ్చిందని వివరించారు. అసలు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మొదట తమ అసిస్టెంట్లకు జడలు వేయించి, మెడలో డాలర్లు తగిలించి ట్రయల్స్ వేసినట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు తిండి కూడా లేకుండా డైట్ పాటిస్తూ, బేర్బాడీ మెయింటైన్ చేయడానికి నాని పక్కనే డంబెల్స్ పెట్టుకుని వర్కౌట్లు చేస్తూ విపరీతంగా శ్రమించారని రామ్-లక్ష్మణ్ ప్రశంసించారు. శ్రీకాంత్ ఓదెల పట్టుదల, రాజీపడని నైజం సుకుమార్‌ను తలపిస్తుందని, నాని డెడికేషన్ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త యాక్షన్ విజువల్స్ అందిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
- Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
- Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?"
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!