Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Lakshman Masters: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్సులకు సంబంధించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు.
షూటింగ్ సమయంలో జరిగిన ఓ ప్రమాదం గురించి రామ్-లక్ష్మణ్ బయటపెట్టిన విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కార్ చేజ్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో అత్యంత రిస్క్‌తో కూడిన స్టంట్ చేశారట. రెండు లారీల మధ్యలో కారును ఛేజ్ చేస్తూ వెళ్లే యాక్షన్ బ్లాక్‌లో పైనుంచి దూకిన స్టంట్‌మ్యాన్ అదుపుతప్పి రెండు లారీల మధ్య ఇరుక్కుపోయి కిందపడ్డాడు. ఈ తీవ్ర ప్రమాదంలో అతని చెయ్యి ఫ్రాక్చర్ అయినట్లు మాస్టర్స్ తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, దర్శకుడు కోరుకున్న సహజత్వం కోసం అసిస్టెంట్లు, డూప్‌లు తీవ్రమైన శారీరక క్షోభను అనుభవించారని వారు గుర్తుచేసుకున్నారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహార్ హీరోయిన్గా నటిస్తోంది. సంపూర్ణేష్ బాబు, మోహన్ బాబు వంటి ఇతర కీలక నటులు ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే వాయిదా పడుతున్నట్లు ప్రచారం జరిగింది కానీ వాయిదా పడడం లేదని చెప్పిన డేట్ కే వస్తున్నట్లుగా అధికారికంగా నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రకటించింది టీం.
తాజావార్తలు
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!