Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్ కి ఊహించని షాక్ ఎదురైంది. ముంబైలోని చర్చ్‌గేట్‌లో ఉన్న ఆమె తల్లిదండ్రుల ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. ఈ ఘటనపై అమీషా తల్లి ఆశా పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన మెరైన్ డ్రైవ్ పోలీసులు.. 40 ఏళ్ల ఇంటి పని మనిషిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, పాల్ఘర్కు చెందిన సీమా ఘాటే అమీషా పటేల్ తల్లిదండ్రుల ఇంట్లో దాదాపు ఏడాదిన్నరగా గృహ సహాయకురాలిగా పనిచేస్తోంది. ఇంట్లోని విలువైన వస్తువులు కనిపించకపోవడంతో ఆశా పటేల్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు తొలుత గుర్తుతెలియని మహిళపై కేసు నమోదు చేసి, ఆధారాలను పరిశీలించారు. అనంతరం దర్యాప్తు బృందం సీమా ఘాటేను నిందితురాలిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, చోరీకి గురైన వస్తువుల్లో సుమారు రూ.5 లక్షల విలువైన డైమండ్ స్టడెడ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయని, ఈ ఆభరణాలు ఆగస్టు 20న ఇంటి నుంచి మాయమైనట్లు తెలుస్తోంది. ఆశా పటేల్ సీమా ఘాటేపై అనుమానంతో నగలను తిరిగి ఇవ్వాలని అడిగిన తిరిగి ఇవ్వకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు ఆధారంగా మెరైన్ డ్రైవ్ పోలీసులు సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని కోర్టులో హాజరుపరచగా, సెప్టెంబర్ 15 వరకు పోలీసు కస్టడీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చోరీకి గురైన ఆభరణాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు నగలు రికవరీ కాలేదని సమాచారం. సీమా ఘాటేకు గతంలో ఏమైనా క్రిమినల్ రికార్డు ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
ఇక అమీషా పటేల్ విషయానికి వస్తే, 2000లో ‘కహో నా… ప్యార్ హై’ సినిమాతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన ఆమె తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’, ‘హమ్రాజ్’, ‘హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్’, ‘భూల్ భులయ్యా’, ‘రేస్ 2’ వంటి సినిమాల్లో నటించారు. 2023లో ‘గదర్ 2’తో మరోసారి పెద్ద తెరపై సందడి చేసిన ఆమె, ఆ సినిమాతో కెరీర్లో మరో భారీ హిట్ అందుకున్నారు. అయితే ఇప్పుడు అమీషా సినిమాల కంటే ఆమె తల్లిదండ్రుల ఇంట్లో జరిగిన ఈ చోరీ ఘటన కారణంగానే వార్తల్లో నిలిచారు. రూ.5 లక్షల విలువైన ఆభరణాలు ఎక్కడ ఉన్నాయి? చోరీ వెనుక అసలు ఏం జరిగింది? నిందితురాలి నుంచి నగలు ఎప్పుడు రికవరీ అవుతాయనేది పోలీసుల తదుపరి దర్యాప్తులో తేలాల్సి ఉంది.
- Tags
- Ameesha Patel
- cinema
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!