Site icon NTV Telugu

The Paradise: ‘ది ప్యారడైజ్’ లో కొత్త ట్విస్ట్ .. మోహన్ బాబు విలన్ కాదా!

Mohan Babu Role The Paradis

Mohan Babu Role The Paradis

The Paradise: నాని హీరో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన బ్లాక్‌ బస్టర్ హిట్‌మూవీ ‘దసరా’. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. గతంలో విడుదల చేసిన ‘రా స్టేట్‌మెంట్’ గ్లింప్స్‌తో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సినీ సర్కిల్‌లో ఈ చిత్రంలో మోహన్ బాబు పాత్రపై సరికొత్త ప్రచారం జరుగుతుంది.

READ ALSO: Pakistan Cricket: ఐసీసీకి పోటీగా కొత్త క్రికెట్ బోర్డు.. పీసీబీ ప్రయత్నం ఆదిలోనే ఫెయిల్?

ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నానికి పెంపుడు తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడని చిత్ర వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఈ సినిమాలో నాని ‘జడల్’ అనే రూల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ మూవీలో నటిస్తున్న తారాగణంపై సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు ‘బిర్యానీ’ అనే పవర్ ఫుల్ రోల్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో Kill నటుడు రాఘవ్ జుయల్‌ను కూడా భాగం అయినట్లు మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

READ ALSO: DDC 0001 Number Plate: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు.. సొంతం చేసుకున్న తెలుగోడు!

Exit mobile version