Site icon NTV Telugu

Anant Ambani Wedding: అంబానీ పెళ్లి ఎఫెక్ట్.. వారందరికీ వర్క్ ఫ్రం హోం..

Anant Ambani Wedding

Anant Ambani Wedding

Anant Ambani Wedding : అనిల్ అంబానీ కుమారుడు అనంత అంబానీ వివాహం నేను ముంబైలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. బాంద్రా కుర్ల కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహం జరుగుతున్న నేపథ్యంలో ముంబై నగరంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. మొత్తం 3 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ముంబై నగరంలోని కొన్ని కంపెనీలు వారి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. నేడు మొదలుకొని జూలై 15 వరకు కంపెనీలు వారి ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని తెలిపాయి. వివాహ వేదిక సమీపంలో ఉన్న అన్ని రోడ్లు ఈ మూడు రోజులు మధ్యాహ్నం ఒంటిగంట నుండి అర్ధరాత్రి వరకు బిజీ ఉండ బోతుండడంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

Earth Quake : జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. పరుగులు పెట్టిన ప్రజలు..

ఇకపోతే., ఈ విషయం సంబంధించి ముంబై నగర స్థానికులు.. అలాగే కొందరు స్థానిక ముంబై ప్రజలు, నెటిజెన్లు వివాహ కార్యక్రమాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశ విదేశాల నుంచి విఐపీ లు చాలామంది పెళ్లి వేడుకలకు వస్తున్న నేపథ్యంలో ఈ వేడుకను పబ్లిక్ ఈవెంట్ గా గుర్తిస్తూ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఇక ఈ పెళ్లి వేడుక నేపథ్యంలో భాగంగా ముంబై నగరంలోని అనేక హోటల్ గదుల అద్దెలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పెళ్లి కార్యక్రమంలో అనేక వాహనాల రాకపోవుకులకు ఇబ్బందులు గురవుతున్నాయి. ముంబై నగరంలోని అనేక రోడ్లలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Bharateeyudu 2: భారతీయుడు 2లో కుర్చీ మడత పెట్టిన గేమ్ ఛేంజర్!

Exit mobile version