NTV Telugu Site icon

Chamala Kiran Kumar Reddy: ఎంపీ నిధులతో కొమురవెళ్లి మల్లన్న దేవాలయాన్ని అభివృద్ధికి కృషి చేస్తా

New Project (46)

New Project (46)

ఎంపీ నిధులతో కొమురవెళ్లి మల్లన్న దేవాలయాన్ని అభివృద్ధికి కృషి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఏర్పాటు అయ్యేలా చూస్తానన్నారు. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో కలిసి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కొమురవెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి..పట్నాలు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణకి కేంద్రం నిధుల మంజూరులో అలసత్వం ప్రదర్శించిందని ఆరోపించారు. ఈ సారి తెలంగాణకి నిధులు మంజూరులో ఎంపీలు పోరాడాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీ,గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. హరీష్ రావు జనగామ నియోజకవర్గ పరిధిలోని మండలాలకు వచ్చే నీటిని తపాస్ పల్లి రిజర్వాయర్ తో సిద్దిపేటకు తీసుకెళ్లి చేర్యాల రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. రంగనాయక సాగర్ నుంచి నకిరేకల్, తుంగతుర్తి బ్రహ్మాణ బంజర్ పల్లి ,వెళ్ళాంల కాలువలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు.

READ MORE: Fire In Goods Train : ఆగి ఉన్న గూడ్స్ రైల్లో పొగలు.. పలు రైళ్లకు అంతరాయం..

కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారం చేపట్టిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 8 స్థానాలును కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో 3 స్థానాలకే పరిమితమైన హస్తం పార్టీ ఈసారి అదనంగా మరో 5 స్థానాల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండే భువనగిరిలో ఆ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌పై 2,22,170 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ 2,56,187 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. తాజాగా చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.