Site icon NTV Telugu

Balakrishna: చంద్రబాబు అక్రమ అరెస్టుపై పార్టీయే కాదు ప్రజలు కూడా ఉద్యమిస్తారు

Balakrishna

Balakrishna

Balakrishna: హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబును కలిసేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ, కోడలు బ్రాహ్మణి సిట్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ 16 నెలలు జైల్లో ఉండటం వలన కక్ష సాధింపు చర్యలతో అక్రమ అరెస్ట్ చేయించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుని పది నిమిషాలు అయినా సరే జైల్లో పెట్టాలని ఉద్దేశంతో అరెస్ట్ చేశారని తెలిపారు. ఎప్పుడో జరిగిన విషయంపై అప్పుడే ముద్దాయిని అరెస్ట్ చేశారని.. ఆ కేసు కోర్టులో ఉందన్నారు. చంద్రబాబును ఎలాగైనా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన పేరు యాడ్ చేసి ఇరికించాలని చూస్తున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు.

Read Also: G20 Summit: ఉక్రెయిన్‌ యుద్ధంపై తీర్మానం.. జీ20 ప్రకటనపై ఉక్రెయిన్‌ ఏమందంటే?

స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ఏర్పాటు చేసి చాలా చాలామంది నిరుద్యోగ యువతకు శిక్షణను కల్పించారని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. మూడు రాజధానులని మూడు సంవత్సరాలు కాలాన్ని కాలయాపన చేసి గడిపేసాడని విమర్శించారు. నవరత్నాలు పేరిట రూ.80 వేల కోట్లు అప్పులు చేశాడని.. ఎవరు తీరుస్తారు ఆ బకాయిలు అని ప్రశ్నించారు. వనరులు ఎలా ఉత్పత్తి చేయాలో సీఎంకి తెలియదని.. అభివృద్ధి అనేది మన రాష్ట్రంలో ఎక్కడ ఉందని విమర్శించారు. గుంతలు తప్ప అభివృద్ధి శూన్యమని.. ఒక రోడ్డైనా ఎప్పుడైనా వేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై పార్టీయే కాదు ప్రజలు కూడా ఉద్యమిస్తారని బాలకృష్ణ పేర్కొన్నారు.

Read Also: Asian Cup 2023: ఇండియాకు పాక్ గట్టి ఝలక్.. బరిలోకి నలుగురు ఫాస్ట్ బౌలర్లు

Exit mobile version