NTV Telugu Site icon

IND vs SL: భారత్-శ్రీలంక మ్యాచ్ టై..

Sl Vs Ind

Sl Vs Ind

భారత్-శ్రీలంక మధ్య కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో మ్యాచ్ టై గా ముగిసింది. 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ బ్యాటర్లు చివరి వరకూ పోరాడినప్పటికీ.. చరిత్ అసలంక చివరి ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. శివం దూబే ఇంకాసేపు ఉండుంటే మ్యాచ్ విజయం సాధించే వాళ్లం.. కానీ..చరిత్ అసలంక వేసిన బౌలింగ్లో దూబే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరగా.. ఇంకో ఒక పరుగు చేయాల్సిన ఉండగా, అర్ష్దీప్ సింగ్ కూడా ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. దీంతో మ్యాచ్.. టై అయింది. 231 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక బౌలర్లు గెలవకుండా కట్టడి చేశారు. భారత్ బ్యాటింగ్ విషయానికొస్తే.. రోహిత్ శర్మ (58) అర్థసెంచరీతో రాణించాడు. మిడిలార్డర్ లో కేఎల్ రాహుల్ (31), అక్షర్ పటేల్ (33), శివం దూబే (25), శ్రేయాస్ అయ్యర్ (23), కోహ్లీ (24), గిల్ (16) పరుగులు చేశారు. శ్రీలంక బౌలింగ్ లో చరిత్ అసలంక, హసరంగ కీలక 3 వికెట్లు తీసి మ్యాచ్ చేజారిపోకుండా ఆపారు. ఆ తర్వాత వెల్లలాగే 2 వికెట్లు.. ధనుంజయ, అశిత ఫెర్నాండో తలో వికెట్ తీశారు.

Theppa Samudram: చైతన్య రావు తెప్ప సముద్రం.. ఎందులో .. ఎక్కడ చూడాలంటే?

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 230 పరుగులు చేసింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో దునిత్ వెల్లలాగే (67), పతుం నిస్సాంకా (56), హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంక బ్యాటింగ్లో నిస్సాంకా 75 బంతులు ఆడి 56 రన్స్ సాధించాడు. అతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు ఉన్నాయి. వెల్లలాగే ఇన్నింగ్స్ లో 65 బంతుల్లో 67 పరుగులు చేశాడు. 2 సిక్సులు, 7 ఫోర్లు సాధించాడు. జనిత్ లియాంగే (20), హసరంగ (24), అఖిలా ధనుంజయ (17), చరిత్ అసలంక (14), కుశాల్ మెండీస్ (14) పరుగులు చేశారు. భారత్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు సాధించారు. మహమ్మద్ సిరాజ్, శివం దూబె, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ చొప్పున పడగొట్టారు.

Nadendla Manohar: రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనాల వల్ల ఎలాంటి లాభం లేదు..