NTV Telugu Site icon

Uttar Pradesh: పోలీసుల సాయం కోసం వచ్చిన ప్రేమజంట.. చివరకు ఏమైందంటే..?

Love Couple

Love Couple

తమకు పెళ్లి జరిపించాలని వచ్చిన ఓ ప్రేమజంటకు పోలీసులు అనుకోని షాకిచ్చారు. ఉత్తర్ ప్రదేశ్లో గురువారం ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. తన ప్రేమికుడినే పెళ్లి చేసుకుంటానంటూ దరఖాస్తు ఇచ్చింది. అయితే.. ఇంతలో అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. తమ బిడ్డను కావాలని తీసుకొచ్చాడని పోలీసులకు తెలిపింది. దీంతో.. పోలీసులు అమ్మాయిని తల్లికి అప్పగించారు. కాగా.. ప్రేమికుడిపై శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు చర్యలు తీసుకున్నారు.

Sex scandal case: ప్రజ్వల్ రేవణ్ణకు అరెస్ట్ వారెంట్ జారీ

వివరాల్లోకి వెళ్తే.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో గత మూడేళ్లుగా ప్రియురాలు ప్రేమ వ్యవహారం కొనసాగిస్తుంది. ఇద్దరూ ఒకే కులానికి చెందినవారు కాగా.. వారిద్దరూ వయసులో కూడా పెద్దవాళ్లే. అయితే.. ప్రియురాలు కుటుంబ సభ్యులు ప్రేమికుడిని వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. కాగా.. పోలీసుల సాయం కోరిన వచ్చిన ప్రేమికులకు ఎదురుదెబ్బ తగిలింది. సాయం చేయాల్సిన వాళ్లే.. సాయం చేయకపోగా, యవతిని తన కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు.. యువకుడిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

Ratan Tata: “బాధ్యతతో ఓటేయండి”.. ముంబై వాసులకు రతన్ టాటా పిలుపు..

ఈ అంశంపై.. పోలీస్ స్టేషన్ హెడ్ హరిఓమ్ సింగ్ మాట్లాడుతూ, తమ కూతురును ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా లేరని తెలిపారు. ఈ కారణంగానే యువతిని తమ కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. మరోవైపు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు యువకుడిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.