Hydrogen Train : మార్చిలో పట్టాలెక్కనున్న నీటితో నడిచే రైలు..
- భారతీయ రైల్వేలో మరో ప్రత్యేక రైలు
- మార్చిలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు
- గంటకు 40 లీటర్ల నీరు
- గరిష్ట వేగం గంటకు 140 కి.మీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల తర్వాత భారతీయ రైల్వే మరో ప్రత్యేక రైలును నడపబోతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే దీనికి కరెంట్ గానీ, డీజిల్ కానీ అవసరం లేదు. వాటికి బదులుగా రైలు ‘నీటి’తో నడుస్తుంది. మొదటి రైలు మార్గాన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్‌గా నిర్ణయించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో 2025 మార్చిలో హైడ్రోజన్ రైళ్లు ప్రజలకు సేవలందించనున్నాయి. భారతీయ రైల్వే దేశంలో హైడ్రోజన్ రైళ్లను నడపబోతోంది. ఒక చక్రానికి 360 కిలోల హైడ్రోజన్ ఇంజిన్‌లో నింపబడుతుంది. హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
గరిష్ట వేగం గంటకు 140 కి.మీ..
గంటకు 40 లీటర్ల నీరు దీనికి అవసరమవుతుంది. గరిష్టంగా గంటకు 140 కి.మీ వేగం వరకు ప్రయాణిస్తుంది. తక్కువ శబ్దంతో నడిచే ఈ రైలులో ఒకసారి పూర్తిగా ఇంధనం నింపితే 1,000 కి.మీ దూరం వెళ్తుంది. చెన్నైలోని ఐసీఎఫ్‌లో ఇప్పటివరకు 175 రకాల 600 డిజైన్‌లలో రైలు బోగీలను విజయవంతంగా తయారు చేశారు. దీని గురించి ఐసీఎఫ్ అధికారులు మాట్లాడుతూ.. “డీజిల్, విద్యుత్తు తర్వాత మొదటిసారిగా హైడ్రోజన్ రైలును దేశంలో తమారు చేస్తున్నారు. హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగించి నడుపుతున్న ఈ రైలు ఇంజిన్ నుంచి నీటి ఆవిరి మాత్రమే బయటికి వస్తుంది. అందువల్ల వీటితో పర్యావరణానికి ఇబ్బంది ఉండదు. మొదట్లో తయారీ ఖర్చు కొంచెం ఎక్కువైనా డీజిల్, విద్యుత్తు రైళ్లతో పోల్చితే హైడ్రోజన్ రైళ్లను నడపడానికి ఖర్చు తక్కువే.” అని తెలిపారు.
Also Read
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
- Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
2030 నాటికి జీరో కార్బన్ దిశ అడుగులు..
భారతీయ రైల్వేలు 2030 నాటికి జీరో కార్బన్ దిశగా పని చేస్తున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ దిలీప్ కుమార్ ఇటీవల తెలిపారు. హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగించబడుతుంది. ప్రాజెక్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, మౌలిక సదుపాయాల పనులు పైలట్ ప్రాజెక్ట్‌గా జరుగుతున్నాయి. దీని పరీక్ష విజయవంతమైంది. సెల్, హైడ్రోజన్ ప్లాంట్ రూపకల్పన ఆమోదించబడింది. హైడ్రోజన్ భద్రతకు సంబంధించి గ్లోబల్ ఏజెన్సీలు ఆమోదం తెలిపాయి. భారతీయ రైల్వేలు హైడ్రోజన్ ఇంధనం కోసం ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ల (DEMU) రెట్రో ఫిట్‌మెంట్ పనిని ప్రదానం చేసింది. ఐసీఎఫ్ చెన్నైలో ప్రోటోటైప్ రైలును తయారు చేయడానికి ప్రణాళిక సిద్ధంగా ఉంది.
తాజావార్తలు
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్‌వర్క్.. కేన్స్‌లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!