Site icon NTV Telugu

Hyderabad: లంచం తీసుకోకుండా ఇంటికి రాదు.. భార్య లంచగొండితనం బయటపెట్టిన భర్త

Manikonda Dee

Manikonda Dee

ఈ భర్తకు నిజంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే.. అక్రమ సంపాదన అయినా, కష్టపడి సంపాదన అయినా.. భార్య డబ్బులు తీసుకొస్తుందంటే సరేలే డబ్బులైతే సంపాదిస్తుందని కామ్‌గా ఊరుకుంటారు. కానీ.. ఇతను చేసిన పనికి మాత్రం ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి భర్తలు ఉన్నారు అంటే.. గ్రేట్ అని చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్య జ్యోతిపై అవినీతి ఆరోపణలను తన భర్తే బయటపెట్టాడు. ప్రతిరోజు లంచం తీసుకురానిది ఇంటికి రాదని భర్త సంచలన ఆరోపణలు చేశాడు.

Read Also: YS Jagan: మంగళగిరి నేతలతో వైఎస్ జగన్ సమావేశం..

తాను తీసుకొచ్చిన లంచానికి ఇవే సాక్షాలు అంటూ ఇంట్లో డబ్బులు దాచిన ప్రతి చోటు చూపిస్తూ భర్త కొన్ని వీడియోలు విడుదల చేశాడు. ఇంట్లో ప్రతి చోట కట్టల కట్టల డబ్బులు చూపిస్తూ రూ. 20 లక్షలు నూ. 30 లక్షలు తీసుకొస్తుంది అంటూ ఆరోపణలు చేశాడు భర్త.. నిత్యం లక్షల్లో లంచం తీసుకుంటుందని, ఏడేళ్ల నుంచి లంచం తీసుకోవద్దని వద్దని వారించినా భారీ మొత్తంలో డబ్బులు తీసుకోవడం తనని మనోవేదనకు గురి చేస్తుందంటూ విడుదల చేసిన వీడియోల్లో పేర్కొన్నాడు. పెద్ద ఎత్తున మణికొండలో కాంట్రాక్టర్ల నుంచి కమిషన్‌ను తీసుకుంటూ లంచాలు భారీగా ఇంటికి తీసుకువస్తుంది అని చెప్పాడు. లంచం మంచిది కాదని.. ఎన్నిసార్లు ప్రవర్తన మార్చుకోమని చెప్పిన మార్చుకోక పోవటంతో భర్త వీడియోలు మీడియాకు పంపించాడు. పెద్ద ఎత్తున ఆరోపణలు రావటంతో రెండ్రోజుల క్రితం జ్యోతి జీహెచ్ఎంసీకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది.

Read Also: RSS: హర్యానా బీజేపీ గెలుపు వెనక ఆర్ఎస్ఎస్.. సంచలన విజయానికి కారణం..

Exit mobile version