NTV Telugu Site icon

Billboard Collapse: ఎట్టకేలకు పట్టుబడ్డ హోర్డింగ్ యజమాని.. 3 రోజుల్లో 3 రాష్ట్రాలు తిరిగాడు

Bhavesh Bhinde

Bhavesh Bhinde

ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు. 16 మంది ప్రాణాలను బలిగొన్న ఆ హోర్డింగ్ పెట్టింది ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని భ‌వేశ్ భిండే 3 రోజులు మూడు రాష్ట్రాలు తిరిగాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ముప్పుతిప్పలు పడ్డాడు. ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. ఈ రోజు ఉద‌య్‌పూర్‌లో అత‌డి పట్టుకున్నారు.

READ MORE: Viral Video : వామ్మో.. ఇదేం డ్యాన్స్ రా నాయనా.. చూస్తే ఫ్యాంట్ తడిచిపోవాల్సిందే..

కాగా. ఇటీవల ముంబైలో గాలివానలకు120 ఫీట్ల ఎత్తున్న బిల్‌బోర్డు కూల‌డం వ‌ల్ల 16 మంది మృతిచెంద‌గా, మ‌రో 75 మంది గాయ‌ప‌డ్డారు. ఈ ప్రమాదం జ‌రిగిన రోజే ఆ హోర్డింగ్ ఓన‌ర్ ప‌రారీ అయ్యాడు. భ‌వేశ్ గురించి ముంబై పోలీసులు వెతకడం మొదలు పెట్టారు. ఎనిమిది బృందాలు అతడి కోసం అన్వేషణ మొదలు పెట్టాయి. ఉద‌య్‌పూర్‌లో ఉన్నట్లు తెలుసుకుని ఓ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. స్థానిక పోలీసుల‌కు చెప్పకుండానే వాళ్లు భ‌వేశ్‌ను ఆధీనంలోకి తీసుకునేందుకు పూనుకున్నారు. చివరకు వారికి ఫలితం లభించింది. ఆ యజమాని పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తొలుత లోనావాలా వెళ్లాడు. అక్కడ నుంచి థానే. ఆ త‌ర్వాత అహ్మాదాబాద్ వెళ్లాడు. మ‌ళ్లీ అక్కడ నుంచి అత‌ను ఉద‌య్‌పూర్ చేరుకున్నాడు. అక్కడ ఓ హోట‌ల్‌లో అత‌ను మ‌రో పేరుతో దాక్కుకున్నట్లు గుర్తించారు. ఆచూకీ తెలుసుకుని వెళ్లేలోగా.. అత‌ను కొత్త సిటీకి పరారీ అయ్యేవాడు. భ‌వేశ్‌ను పట్టుకునేందుకు ముంబై పోలీసులు 8 బృందాలుగా ఏర్పడగా.. చివరకు క్రైం బ్రాంచ్ పోలీసుల‌కు అత‌ను చిక్కాడు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కోర్టుకో అప్పగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.