బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. యూనిఫాం ధరించకుండ పాఠశాలకు వచ్చిన 6వ తరగతి విద్యార్థిని చితకబాదాడు హెడ్ మాస్టర్. తీవ్రంగా కొట్టడంతో వీపుపై పెద్దపెద్ద గాయాలయ్యాయి. ఈ ఘటనలో ప్రధానోపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
High BP: అధిక రక్తపోటు లక్షణాలు ఎలావుంటాయంటే.. జాగ్రత్త సుమీ..
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ముర్షిదాబాద్‌లోని భగవంగోలలో భాగవంగోల హైస్కూల్‌కు చెందిన ఆరో తరగతి విద్యార్థిని స్కూల్ యూనిఫాం ధరించలేదని ప్రధానోపాధ్యాయుడు దారుణంగా కొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తీవ్ర దెబ్బలకు విద్యార్థి వెన్నుముక విరిగిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో.. విద్యార్థిని చితకబాదిన ప్రధానోపాధ్యాయుడిని శిక్షించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. పాఠశాల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
Tata Punch: టాటా ‘పంచ్’ అదిరింది.. అమ్మకాల్లో జోరు.. టాప్ 10 కార్లు ఇవే..
ప్రిన్సిపల్ నజ్ముల్ హక్ తమ కుమారుడిని వెదురు కర్రతో నిర్దాక్షిణ్యంగా కొట్టాడని, దీంతో అతడి వెన్ను విరిగిపోయిందని విద్యార్థి అలామిన్ హక్ తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనపై భగవంగోల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తొలుత నజ్ముల్ హక్ వైద్య ఖర్చులన్నీ భరిస్తానని హామీ ఇచ్చాడని తల్లిదండ్రులు తెలిపారు. మొదట్లో కొంత డబ్బు ఇచ్చినా ఆ తర్వాత ఇవ్వడం ఆపేశాడు. అంతేకాకుండా.. విద్యార్థిని కొట్టడాన్ని కూడా ఖండించాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయంలో పాఠశాల యాజమాన్యం పెదవి విప్పడం లేదు.
