NTV Telugu Site icon

STOP Drinking Alcohol: ఒక్కసారిగా మద్యం తాగడం మానేస్తే ఇన్ని సమస్యలా?

Stop Drinking Alcohol

Stop Drinking Alcohol

STOP Drinking Alcohol: ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ ఈ విషయం మనందరికీ తెలుసు. ఇది తెలిసి కూడా చాలా మంది దానిని తాగుతూనే ఉంటారు. మద్యం అలవాటు అయిపోతే, దానిని వదిలించుకోవడం చాలా కష్టం. ఒక్కసారి మద్యం తాగిన వ్యక్తి దానిని మానడానికి పలు కష్టాలను ఎదుర్కొంటాడు. మద్యం మానేందుకు ప్రజలు తరచూ మందులు, ఇతర మార్గాలను ఉపయోగిస్తుంటారు. మద్యం మానేయడం వల్ల చాలా మందిలో మానసిక ఆందోళనలు, ఉద్రిక్తతలు, అలసట వంటి లక్షణాలు సృష్టిస్తుంది. మద్యం మానేస్తే, కొందరికి చెవుల్లో శబ్దాలు వినిపించడం, ఇతరులు పిలుస్తున్నట్లు అనిపించడం వంటి అనుభవాలు ఉంటాయి.

Read Also: Eblu Feo X: 5 సంవత్సరాల వారంటీతో బడ్జె‌ట్ ధరలో ఫ్యామిలీ EV స్కూటర్!

అందుకే, మద్యపానాన్ని ఆకస్మాత్తుగా మానేయకుండా, క్రమంగా తగ్గించడం మంచి అలవాటు. తరుచుగా ఒకసారి తాగే వారు సడన్‌గా మద్యం మానేస్తే పెద్దగా సమస్యలు ఉండకపోయినా, ప్రతిరోజూ తాగే వారు మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మద్యం ఎక్కువ కాలం పాటు సేవించిన వ్యక్తి ఒక్కసారిగా మద్యం మానేస్తే మూడు రోజుల్లోనే మానసిక సమస్యలు మొదలవుతాయని నివేదికలు పేర్కొంటున్నాయి. మరింత ఎక్కువ మద్యం సేవించిన వారు మద్యం మానేస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. దీనికి కారణం, మద్యపానంతో నిత్యం శరీరానికి సరైన ఆహారం అందని పరిస్థితి. అలాంటి వారు మద్యం మానేసినప్పుడు, శరీరంలో నాడీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కన్పిస్తాయి. ఆహారం తీసుకోకపోవడం వల్ల కిడ్నీ, ఇతర అవయవాల్లో సమస్యలు ఏర్పడవచ్చు.

Read Also: AP Assembly: అసెంబ్లీ వైపు చూడని ఎమ్మెల్యేలు..! భారీగా తగ్గిన హాజరు..

మద్యం మానేయడానికి సూచనలు:

క్రమంగా తగ్గించండి:
మద్యం మానాలని అనుకుంటే, దాన్ని ఒక్కసారిగా మానేయడం కంటే క్రమంగా తగ్గించడం మంచిది. రోజువారీ మద్యపానాన్ని తగ్గించి, వారానికి లేదా నెలకి ఒకసారి తాగడం మంచిది.

ఆహారం తీసుకోండి:
మద్యపానాన్ని మానినప్పుడు ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఆహారం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మానసిక సహాయం:
మద్యం మానకపోవడం కష్టంగా అనిపించినప్పుడు, మానసిక సహాయం తీసుకోవడం చాలా సహాయపడుతుంది.

వైద్యులు సూచించిన మార్గాలు:
వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల సూచనలతో మద్యం మానడం మరింత సురక్షితంగా ఉంటుంది.

మద్యం మానడం శారీరక, మానసిక సమస్యలను కలగచేయకుండా ఉండాలంటే క్రమక్రమంగా చేయడం మంచిది. మద్యం మానడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.