తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రీసెంట్ లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.’లియో’ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు.గత ఏడాది అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం దళపతి విజయ్ తన తరువాత మూవీగా ఓ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీని చేస్తున్నారు. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీలో విజయ్ డ్యుయల్ రోల్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జోరుగా జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ స్పాట్‍కు అభిమానులు భారీగా తరళి వచ్చారు. వారందరికీ అభివాదం చేస్తూ విజయ్ వారితో ఓ సెల్ఫీ కూడా దిగారు. క్లీన్ షేవ్ తో విజయ్ నయా లుక్‍లో కనిపించి విజయ్ ఫ్యాన్స్ ఆశ్చర్యపరిచారు.ఇదిలావుంటే.. పొంగల్ కానుకగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసారు.. ఈ పోస్టర్‌లో విజయ్‌తో పాటు డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా, తమిళ నటుడు ప్రశాంత్ మరియు అజ్మల్ అమీర్ ఉన్నారు. వీళ్ళందరూ గన్స్ పట్టుకుని ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు.ప్రస్తుతం ఈ పిక్ తెగ వైరల్ అవుతుంది.ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్ మరియు జయరాం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు.
— Vijay (@actorvijay) January 15, 2024