Governor Tamilisai: తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ తో పాటు సభ్యుల రాజీనామాను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.. అయితే, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇతర సభ్యులు డిసెంబర్ లో రాజీనామాలు సమర్పించిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అడిగిన గవర్నర్.. దీంతో పాటు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. కాగా, గత చైర్మన్ , బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని గవర్నర్ సూచించారు.
Read Also: Drugs: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం వారి రాజీనామాలను ఆమోదించినట్లు పేర్కొన్నారు. కొత్త ఛైర్మన్, సభ్యుల నియామకానికి గవర్నర్ అనుమతించారు. నిన్న (మంగళవారం) సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీరి రాజీనామాలను ఆమోదించడానికి తమకు అభ్యంతరం లేదని లేఖ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో వెంటనే స్పందించి వారి రాజీనామాలను ఈరోజు తమిళిసై ఆమోదించారు. ఇక, పేపర్ లీకేజీ లాంటి విషయాలను సీరియస్ గా తీసుకుని.. సమగ్ర విచారణ జరిపి, దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ గట్టిగా సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మరెవరూ భవిష్యత్ లో ఆటలాడకుండా.. కఠినమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.