AP Assembly: అసెంబ్లీ సమావేశాలు రెండో రోజులో భాగంగా సభలో ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశ పెట్టనుంది. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ బిల్లు- 2023, ఏపీ వైద్య విధాన పరిషత్ రిపీల్ (రద్దు) బిల్లు -2023, ఏపీ ఆధార్ బిల్లు -2023ను ప్రవేశపెట్టనుంది. అంతేకాకుండా.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కుంభకోణం తీసుకున్న చర్యల పై స్వల్ప కాలిక చర్చ జరుగనుంది.
Read Also: IPL 2024: కేకేఆర్లోకి గౌతమ్ గంభీర్..! షారుక్ తో భేటీ అందుకే
రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగానే మూలపేట ఓడ రేవు నిర్వాసితులకు సహాయ, పునరావాసం, బలవర్ధకమైన బియ్యం పంపిణీ, దిశా బిల్లు పై ప్రశ్నోత్తరాలు జరుగనున్నాయి. అంతేకాకుండా.. దేవాలయ భూముల పరిరక్షణ, జల్ జీవన్ మిషన్, నవ రత్నాలు – పేదలందరికీ ఇళ్ళు, అంశాల పై ప్రశ్నలు జరుగనున్నాయి.
నూతన వైద్య కళాశాలల్లో ఫీజులు, మహిళా సాధికారత అంశాల పై కూడా ప్రశ్నలపై చర్చ జరుగనుంది.
Read Also: Padma Hilsa: దుర్గా నవరాత్రి ఉత్సవాలకు బంగ్లాదేశ్ గిఫ్ట్.. “పద్మా పులస” చేపల ఎగుమతికి ఓకే..
అటు.. రేపు ఉదయం పది గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంతో పెద్దల సభ ప్రారంభం కానుంది. ప్రభుత్వ రుణాలు, కేజీ బేసిన్ లో భూగర్భ జలాల కలుషితం, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు, కళ్యాణ్ మస్తు, హజ్ యాత్ర, డీఎస్సీ నోటిఫికేషన్ అంశాల పై మండలిలో ప్రశ్నలు జరుగనున్నాయి.