Damodar Rajanarsimha: వైద్యారోగ్య శాఖ సాహసోపేతమైన నిర్ణయం.. 4356 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అధ్యాపకుల, సిబ్బంది కొరతను తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రకటించింది. 2021 నుండి రాష్ట్రంలో ఉన్న 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఖాళీగా ఉన్న 4356 టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వెంటనే స్పందించి పోస్టుల భక్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అందులో భాగంగా 4356 పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ జీవోను విడుదల చేసిందని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఇందులో ప్రొఫెసర్ పోస్టులు 498, అసోసియేట్ ప్రొఫెసర్ 786, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1459, ట్యూటర్లు 412, సీనియర్ ప్రెసిడెంట్ 1201 పోస్టులను భర్తీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల బలోపేతం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయంతో ప్రతి సంవత్సరం 634 కోట్ల 48 లక్షల రూపాయల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పై భారం పడుతుందని మంత్రి వెల్లడించారు.
Also Read
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6958 స్టాప్ నర్సుల నియామకాల్లో భాగంగా మెడికల్ కాలేజీల్లో నియమకాలు చేపట్టామన్నారు. వైద్య కళాశాలలకు అనువైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన వైద్య విద్యను రాష్ట్రంలో అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. ఈ సాహసపేతమైన నిర్ణయం వల్ల చేపట్టిన నియామకాల ద్వారా నేషనల్ మెడికల్ కమిషన్ తనిఖీల్లో ప్రధానంగా ఆధార్ బేస్డ్ అటెండెన్స్ మానిటరింగ్ సమస్యను అధిగమించబోతున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఈ నియామకాలు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ కమిటీ ద్వారా సత్వరమే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ హెల్త్ సెక్రటరీని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
తాజావార్తలు
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!