NTV Telugu Site icon

Kollu Ravindra: ఏపీలో మద్యం ప్రియులకు శుభవార్త.. దసరా పండుగకు ముందే

Kollu Ravindra

Kollu Ravindra

ఏపీలో మద్యం ప్రియులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా పండుగకు ముందే మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత ప్రభుత్వం మద్యం పాలసీ ద్వారా దోపిడీ చేసింది.. ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ షాప్స్ నిర్వహణ జరిగేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రెండు రోజుల్లో షాపుల ఏర్పాటుపై గైడ్ లైన్స్ ఇస్తాం.. ఏ జిల్లాలో ఎన్ని షాపులు అనే వివరాలు వస్తాయని చెప్పారు. 7 రోజుల పాటు దరఖాస్తులు చేసుకోవచ్చు.. మధ్యలో 2 రోజులు సెలవులు వస్తున్నాయి.. పదో రోజున డ్రా తీస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 2 లక్షలు ఒక దరఖాస్తు ఫీజు.. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులు ఎన్నైనా వేయవచ్చన్నారు.

Read Also: NTR: ఈ విషయంలోనే లక్ష్మీ ప్రణతికి నాకు గొడవలు అవుతాయి..

డ్రాలో పేర్లు వచ్చిన వారు లైసెన్స్ ఫీజులు 4 స్లాబులో రకాలుగా ఉన్నాయి.. స్లాబులు ఏరియా బట్టి నిర్ణయం ఉంటుంది.. ఇవి 6 వాయిదాలలో కట్టుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అన్ని బ్రాండ్లు అందే విధంగా పారదర్శకంగా అందిస్తున్నాం.. 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని సామాన్యులకు అందిస్తున్నాం.. గత ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్‌మెంట్ వారిని సెబ్ పేరుతో విడగొట్టారని తెలిపారు. ఇప్పుడు రెండింటినీ కలుపుతూ నిర్ణయం తీసుకున్నాం.. సీన‌రేజ్ చార్జి కట్టి లోడింగ్ అన్ లోడింగ్ కడితే పట్టా ల్యాండ్‌లో సాండ్ తీసుకోవచ్చని మంత్రి సూచించారు.

Read Also: Israel- Iran: ఇజ్రాయెల్పై అణు దాడి చేయాలని ఇరాన్ ప్రజలు డిమాండ్..