NTV Telugu Site icon

Praja Bhavan: డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రజా భవన్

Batti

Batti

Praja Bhavan: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజా భవన్ ను కేటాయించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో.. డిప్యూటీ సీఎం భట్టి ప్రజా భవన్ కి షిఫ్ట్ అవ్వనున్నారు. కాగా.. నిన్న రాత్రి ప్రజా భవన్ భట్టి విక్రమార్క పరిశీలించారు. రేపు ఉదయం 8.20కి ఆర్ధిక మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత.. ప్రజా భవన్ లో అధికారిక నివాస భవనంలో ఉండనున్నారు.

Read Also: CM Review: కాసేపట్లో ధరణిపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. అక్కడ ఇన్ని రోజుల పాటు ప్రజా దర్బార్ ను కూడా నిర్వహించారు. ఇప్పటి నుంచి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజా దర్బార్ నిర్వహస్తుంది. ఆ కార్యక్రమంలో.. సామాన్యుల నుంచి వినతులు స్వీకరించి, పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది.

Read Also: Gidugu Rudra Raju: ‘వై నాట్ కాంగ్రెస్’ నినాదంతో ప్రజల్లోకి

ఇదిలా ఉంటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజా భవన్ ను ప్రకటించడంతో.. మరి సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఎక్కడ అనేది అందరు చర్చించుకుంటున్నారు. అయితే, ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంగా మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రాన్ని (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ) భవనాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్.. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది.