NTV Telugu Site icon

The Goat OTT: విజయ్‌ అభిమానులకు శుభవార్త.. ఓటీటీలోకి ‘ది గోట్‌’! స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

The Goat Review

The Goat Review

Vijay’s The GOAT On Netflix: దళపతి విజయ్‌ హీరోగా దర్శకుడు వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన చిత్రం ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్‌లో బంపర్ హిట్ కొట్టిన ది గోట్‌.. మిగతా భాషల్లో పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తమిళనాడులో రూ.218 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.452 కోట్లకు పైగా వసూలు చేసింది.

థియేటర్లలో అభిమానులను అలరించిన ది గోట్‌ ఓటీటీలోకి రానుంది. అక్టోబర్‌ 3 నుంచి ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. థియేటర్లలో చూడని వారు దసరా పండగ సెలవుల్లో ఎంజాయ్ చేయనున్నారు.

Also Read: iPhone 15 Pro Max: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. చౌకగా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్!

ది గోట్‌ చిత్రంలో విజయ్‌ సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించగా.. చెన్నై అందం త్రిష కృష్ణన్ అతిథి పాత్రలో కనిపించారు. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ‘డీ-ఏజింగ్‌’ టెక్నాలజీని వినియోగించి విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిగా చూపించారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేశారు.

Show comments