NTV Telugu Site icon

Bihar : వామ్మో.. ప్రియుడి మార్మాంగాన్ని కోసిన ప్రియురాలు.. దారుణం..

Crime,scene,tape,with,blurred,forensic,law,enforcement,background,in

Crime,scene,tape,with,blurred,forensic,law,enforcement,background,in

ఓ యువతి తనని నమ్మించి మోసం చేసిన ప్రియుడిని అతి దారుణంగా మార్మాంగాన్ని కోసి చంపేసింది.. తనని రహస్యంగా పెళ్లి చేసుకొని వాడుకొని ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం అవుతున్నాడని తెలిసి పక్కా ప్లాన్ తో యువకుడిని రహస్యంగా కలవమని చెప్పి అదును చూసి మార్మాంగాన్ని కోసింది.. దాంతో రక్తస్రావం అయిన అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు.. అయితే అతను చికిత్స తీసుకుంటు తాజాగా చనిపోయాడు.. ఈ దారుణ ఘటన బీహార్ లో వెలుగు చూసింది..

బీహార్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పట్నాలో తనను మోసం చేశాడని ప్రియుడి మర్మంగాన్ని కోసేసింది ఓ యువతి. అతను ఆ యువతిని రహస్య వివాహం చేసుకున్నాడు..అయితే మళ్లీ మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు ఈ దారుణానికి ఒడిగట్టింది. ఆ బాధితుడు సిఆర్పిఎఫ్ జవాన్. చత్తిస్గఢ్ లో విధుల్లో ఉన్నాడు. అతను గత మూడేళ్లుగా తన బంధువుల అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు.. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.. అంతేకాదు.. ఇటీవలే ఆమెను రహస్యంగా వివాహం కూడా చేసుకున్నాడు. ఇటు ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్న ఆ జవాను మరోవైపు.. ఈ నెల 23వ తేదీన మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ విషయం ఆ యువతికి తెలిసింది. తీవ్ర మనస్థాపానికి గురైంది.

ఈ క్రమంలోనే పట్నాలోని హోటల్ కి రమ్మని ప్రియుడిని పిలిచింది..అక్కడ ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ప్లాన్ ప్రకారం మాయ చేసి పదునైన కత్తితో అతని మార్మాంగాన్ని కోసేసింది..వెంటనే అక్కడి నుంచి తప్పించుకుంది. విషయం పోలీసులకు చేరడంతో ఆమె మీద కేసు నమోదు చేసి.. నిందితురాలని అరెస్టు చేశారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.. తీవ్ర రక్త స్రావం కావడంతో అతను మరణించాడు.. ఇరు కుటుంబాల్లో పెద్దగా ఘర్షణకు దారి తీసింది.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. ఇలాంటి ఘటనే మొన్న తమిళనాడు లో జరిగింది.. నిన్న ఆంధ్రాలో జరిగింది.. ప్రేమించిన వ్యక్తి తనకు దక్కలేదని అతి దారుణంగా హతమార్చింది ఓ ప్రియురాలు. అర్ధరాత్రి అతడి ఇంటికి వెళ్లి కత్తిపీటతో దాడి చేసి ప్రాణాలు తీసింది.

Show comments