NTV Telugu Site icon

Hyderabad: ప్రియుడి వేధింపులు.. సూసైడ్ నోట్ రాసి ప్రియురాలి ఆత్మహత్య

Sucide

Sucide

ప్రేమించి మోసపోయి తమ ప్రాణాలను అనవసరంగా బలి తీసుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడటం.. ప్రియుడితో గొడవలు పడటం.. చిన్న చిన్న పనులకు మనస్పర్ధాలు రావడం.. దీంతో ప్రాణాలను గాల్లో కలిపేసుకోవడం. ఎక్కడో చోట రోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. వారు చనిపోయే ముందు తమను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదు. ప్రియుడితో గానీ, ప్రియురాలితో గొడవలు పడి తమ ప్రాణాలను వదిలేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రియుడి వేధింపులతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.

Read Also: Dangal Actress Zaira Wasim : దంగల్ నటి ఇంట తీవ్ర విషాదం

జీడిమెట్ల పియస్ పరిధిలోని న్యూ ఎల్బీనగర్ లో దారుణం జరిగింది. షాపూర్ నగర్, ఎన్ ఎల్బీనగర్ లో నివాసం ఉండే అఖిల (22) అనే అమ్మాయిని అదే ప్రాంతంలో నివాసం ఉండే అఖిల్ సాయిగౌడ్ 8 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. తొలుత అఖిల ప్రేమను తిరస్కరించడంతో.. చనిపోతానని అఖిల్ గౌడ్ బెదిరించడంతో తప్పని పరిస్దితిలో అఖిల ప్రేమించింది. ఈ మధ్య అఖిల్ గౌడ్ అఖిలతో చిన్నచిన్న విషయాలపై గొడవపడి రోడ్డుపై వేధించడం ప్రారంభించాడు. పెళ్ళి చేసుకోనని తేల్చిచెపడంతో అఖిల తీవ్ర మనస్దాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. భాదితురాలి తండ్రి కుమార్ (54) ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ గౌడ్ ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Read Also: Ravindra Jadeja: ఐసిసి టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 క్యాప్‌ని జడేజాకు అందించిన టీమిండియా కోచ్..

Show comments