Dangal Actress Zaira Wasim : దంగల్ నటి ఇంట తీవ్ర విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dangal Actress Zaira Wasim Father Passes Away : అమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమాలో నటించిన జైరా వసీం తండ్రి కన్నుమూశారు. ఈ బ్యాడ్ న్యూస్ ను ఆ నటి స్వయంగా అభిమానులతో పంచుకుంది. తన తండ్రి స్వర్గానికి వెళ్లాలని ప్రార్థనలు చేయమని కూడా ఆమె అభ్యర్థించింది. ఇక ఈ విషయాన్ని జైరా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులకు తెలియజేసింది. ‘నా తండ్రి జాహిద్ వాసిమ్ ఈ లోకాన్ని విడిచి పెట్టారు. మీ ప్రార్థనలలో ఆయనను స్మరించుకోవాలని, ఆయన క్షమాపణ కోసం అల్లాహ్‌ను ప్రార్దిన్చాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. అల్లా వారి పాపాలను క్షమించమని ప్రార్థించండి. వారి సమాధిని ఓదార్పు స్థలంగా చేసి శిక్ష నుండి వారిని రక్షించండి. వారిని ఆ లోకంలో హాయిగా జీవించనివ్వండి. వారికి స్వర్గంలో ఉన్నత స్థానం ఇవ్వండని అంటూ ఆమె రాసుకొచ్చింది. జైరా వసీం దంగల్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ ‘దంగల్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Vadivelu: వడివేలు కామెడీ.. కోమా నుంచి బయటపడ్డ బాలిక!!
Also Read
- Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
- Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
సినిమాలో ఆమె చిన్ననాటి రెజ్లర్ గీతా ఫోగట్ పాత్రలో నటించింది. ఈ సినిమా తర్వాత అమీర్‌ఖాన్‌తో ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ చిత్రంలో కూడా నటించింది. ఇక ‘దంగల్’ చిత్రానికి గానూ జైరా వాసిమ్ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. 2019 సంవత్సరంలో, జైరా ప్రియాంక చోప్రా మరియు ఫర్హాన్ అక్తర్‌లతో కలిసి ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రంలో కూడా ఆమె కనిపించింది. అయితే ‘ది స్కై ఈజ్ పింక్’ జైరా వాసిమ్ నటించిన చివరి చిత్రం. జూన్ 2019 లో, జైరా నటనకి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నివసిస్తున్న జైరా వాసిమ్, తన నటనా జీవితం తన మతం మరియు విశ్వాసానికి దారితీస్తుందని పేర్కొంది. ఆ తరువాత, నవంబర్ 2020 లో, జైరా తన కొత్త జీవితాన్ని ప్రారంభించినందున సోషల్ మీడియా నుండి కూడా తన చిత్రాలను తొలగించమని అభిమానులను అభ్యర్థించింది.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!