NTV Telugu Site icon

PM Modi: ప్రధాని మోడీని కలిసిన పీవీ.నరసింహారావు కుటుంబం

Pm

Pm

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారం రాత్రి బస చేయనున్నారు. అయితే ప్రధాని మోడీని మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కుటుంబం కలిసింది. ఇటీవలే ఆయనకు కేంద్రప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఈ సందర్భంగా మోడీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానితో గ్రూఫ్ ఫొటో తీసుకున్నారు. ఈ సందర్భంగా సంస్కృతి, భారతదేశం యొక్క అభివృద్ధి, పురోగతి అంశాలు సహా అనేక ఇతర సమస్యల గురించి కూడా చర్చించారు.

బుధవారం ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం మోడీ వేములవాడ చేరుకున్నారు. మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. కూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

ఏపీలో మోడీ టూర్ ఇలా..
ప్రధాని మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి తరపున మోడీ రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. బుధవారం ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.35 నిముషాలకు తిరుపతి నుంచి హెలికాఫ్టర్‌లో రాజంపేటలోని కలికిరికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.45 నిమిషాలకు బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

ఇక సాయంత్రం 5:20కి సభా ప్రాంగణం నుంచి మోడీ హెలికాఫ్టర్‌లో బయల్దేరి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6.25కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గాన బందర్ రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియానికి రాత్రి 7 గంటలకు చేరుకుంటారు. స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు గంటసేపు ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం గన్నవరం నుంచి నేరుగా ఢిల్లీకి ప్రధాని మోడీ వెళ్తారు.

Show comments