Site icon NTV Telugu

Hyderabad: రెచ్చిపోయిన మాజీ మేయర్ అనుచరులు..పక్కనే ఉన్న పట్టించుకోని ఎమ్మెల్యే

New Project (45)

New Project (45)

బండ్లగూడ జాగీర్ మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు రెచ్చిపోయారు. హరిత మహోత్సవం కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ తో అసభ్యంగా ప్రవర్తించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే దురుసుగా ప్రవర్తించారు.. మాజీ మేయర్ అనుచరులు. అడ్డుకున్న కార్పొరేటర్లపై దాడికి పాల్పడ్డారు. పిడుగుద్దుల వర్షం కురిపించారు. ఎమ్మెల్యే ఎదుటే రౌడీలుగా వ్యవహరిస్తూ.. కొట్టుకున్నారు. 1 వ వార్డు కార్పొరేటర్ చంద్రశేఖర్ చొక్కా చింపి వేసి కులం పేరుతో బూతులు తిడుతూ దాడి చేశారు. 5 వ వర్డు కార్పొరేటర్ శ్రీనాద్ రెడ్డి తో పాటు పలువురి పై దాడికి పాల్పడ్డ గుండాలు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బాధితులు అక్కడ ఫిర్యాదు చేశారు.

READ MORE: Revanth Reddy : డి శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్..

కాగా.. మేడ్చల్ మాల్కాజిగిరి మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల తీర్మాణ వివాదం తారస్థాయికి చేరింది. తూంకుంట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ఘర్షణకు దిగారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ వాణి వీరారెడ్డిపై కౌన్సిలర్లు వేణుగోపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనుచరులు కుర్చీలతో దాడి చేశారు. ఈ దాడిలో పన్నాల వాణి వీరారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. గత కొద్ది రోజులుగా తూంకుంట మున్సిపాలిటీలో అవిశ్వాసం విషయంలో కౌన్సిలర్ల మధ్య వివాదం కొనసాగుతోంది.

Exit mobile version