NTV Telugu Site icon

Encounter: ఢిల్లీలో కాల్పులకు పాల్పడిన నిందితుడి ఎన్ కౌంటర్..

Gun Fire

Gun Fire

రాజధాని ఢిల్లీలోని తిలక్ నగర్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఓ షూటర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌కి, దుండగులకు మధ్య అర్ధరాత్రి భల్స్వా డెయిరీ ప్రాంతంలో ఘర్షణ జరిగింది. ఇరువర్గాల నుంచి భారీ కాల్పులు జరగ్గా పోలీసులు ఓ నేరస్థుడిని హతమార్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు, దుండగులకు మధ్య జరిగిన ఫైరింగ్ లో ఒక నేరస్థుడికి అనేక బుల్లెట్లు తగిలాయి. ఆ తర్వాత పోలీసు బృందం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. హతమైన నేరస్థుడిని షూటర్ అజయ్ అలియాస్ ‘గోలీ’గా గుర్తించారు. హర్యానాలోని సోనిపట్‌లో నివాసముంటున్నాడు. కాగా.. గోలీ భారతదేశం నుంచి తప్పించుకుని పోర్చుగల్‌లో కూర్చున్న హిమాన్షు భౌ అనుచరుడిగా గుర్తించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇందులో కారు, స్కార్పియో ఒకదానికొకటి ఢీకొన్న దృశ్యం కనిపించింది. ఘటనా స్థలంలో పలువురు పోలీసులు కూడా ఉన్నారు.

READ MORE:Delhi : ఢిల్లీలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. 6780 మెగావాట్లకు చేరిక

ఇదిలా ఉండగా.. మే 6న ఢిల్లీలోని తిలక్ నగర్‌లో ఇద్దరు షూటర్లు కాల్పులకు పాల్పడ్డారు. 15కి పైగా బుల్లెట్లు పేల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అయితే షోరూమ్‌లోని అద్దాలు పగలడంతో పాటు నలుగురికి గాయాలయ్యాయి. విచారణలో గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భౌ పేరు బయటకు వచ్చినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఓ షూటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన ఒక షూటర్‌ను సన్నీ గుర్జార్‌గా గుర్తించారు. అతను విదేశాలలో కూర్చున్న పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌తో ప్రత్యక్ష సంబంధంలో ఉన్నట్లు తేల్చారు. ముగ్గురు షూటర్లు బైక్‌లపై వచ్చినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తెలిపింది. బీజేపీ నేత వికాస్ త్యాగి తన కుమారుడికి పుట్టినరోజు కానుకగా కారు కొనేందుకు వచ్చిన రోజున ఈ ఘటన జరిగింది. ఘటనపై సమాచారం అందిన వెంటనే ఢిల్లీ పోలీసులు భారీ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. సీనియర్ పోలీసు అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.