Site icon NTV Telugu

AP Schools: మరో వారం రోజుల పాటు ఒంటిపూట బడులే..

Ap Schooks

Ap Schooks

ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. జూన్ మూడో వారం వచ్చినా ఎండలు మాత్రం తగ్గడం లేదు.. రికార్డు స్టాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 12 నుంచి వేసవి సెలవుల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభమయ్యాయి. కొనసాగుతున్న వేసవి కారణంగా సెలవులు పొడిగించాలని అభ్యర్దనలు రావడంతో ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీ విద్యా శాఖ గతంలో నిర్ణయించింది.. అయితే, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Read Also: Shiv Sena: ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ.. షిండే వర్గంలో చేరిన కీలక నేత..

ఏపీలో ఎండలు మండిపోతుండటంతో.. ముందుగా ప్రకటించిన ఎకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు స్టార్ట్ అయ్యాయి. భారీ ఉష్ణోగ్రతల కారణంగా ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 17వ తేదీ వరకు అదే విధంగా పాఠశాలలు కొనసాగాయి.. ఇప్పటికీ ఎండల తీవ్రత తగ్గకపోవటంతో రాష్ట్ర విద్యాశాఖ ఈ నెల 24వరకు ఒంటిపూట బడులు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించాలని తెలిపింది.

Read Also: Skin Care Tips: ఈ హోం రెమెడీ ట్రై చేస్తే.. మీ ముఖం చందమామలా మెరుస్తుంది!

ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల వరకు రాగిజావా పంపిణీ చేయాలని సూచించింది. ఇక చివరగా ఉదయం 11.30 గంటల నుంచి 12.00 గంటల వరకు మధ్యాహ్న భోజనం ఉంటుందని క్లారిటి ఇచ్చింది. ఈ వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాతావరణంలో మార్పు కనిపిస్తే 26వ తేదీ నుంచి ముందుగా ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా ఈ వారంతంలో విద్యాశాఖ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందని అధికారులు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల ప్రారంభం నుంచి విద్యార్ధులకు విద్యా కానుక అందిస్తోంది. ఈ నెల 28న ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం అమల్లో భాగంగా నాలుగో విడత నిధులు విడుదల చేయనుంది. 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ 15 వేల చొప్పున నిధులను జమ చేయనుంది.

Exit mobile version