Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం ‘థలైవర్ 173’ దర్శకుడి విషయంలో గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే బాధ్యతను ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. కమల్ హాసన్ తన ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను నిర్మించబోతున్నారు.
ముందుగా ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహిస్తారని ప్రకటన చేసారు కానీ అనుకోని కారణాల వలన సుందర్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత సిబి చక్రవర్తి పేరుతో మరొక ప్రకటన చేసారు. ఇటీవల సీబీ ఈ సినిమా నుండి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. సీబీ స్తానంలో అశ్వత్ మారిముత్తు పేరు వినిపించింది. కానీ చివరికి సిబి చక్రవర్తి చెప్పిన కథకే రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి చేసుకున్న వెంటనే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాలో రజనీకాంత్ సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తారని, సిబి చక్రవర్తి తనదైన మార్క్ ఎంటర్టైన్మెంట్‌తో స్క్రిప్ట్ సిద్ధం చేశారని టాక్. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రజనీకాంత్ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే సిబి చక్రవర్తి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా సిబి ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!