Site icon NTV Telugu

Chandramukhi 3 : చంద్రముఖి 3 పై అప్డేట్ ఇచ్చిన దర్శకుడు..

Whatsapp Image 2023 09 23 At 9.36.45 Pm

Whatsapp Image 2023 09 23 At 9.36.45 Pm

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ చంద్రముఖి. ఈ సినిమా హార్రర్‌ కామెడీ చిత్రాల్లో ఓ ట్రెండ్‌ సెట్ చేసింది… `చంద్రముఖి` చిత్రంలో రజనీ మేనరిజం స్టైల్ అలాగే జ్యోతిక నట విశ్వరూపం సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ చేసింది.రీసెంట్ గా ఈ సినిమాకి సీక్వెల్‌ తెరకెక్కింది.. `చంద్రముఖి2` పేరుతోనే ఈ సినిమాను రూపొందించారు. సీక్వెల్ లో నటించడానికి రజనీ ఆసక్తి చూపించక పోవడం తో ఆయన స్థానంలో రాఘవ లారెన్స్ హీరోగా నటించాడు.. అలాగే చంద్రముఖిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ నటించింది..ఈ సినిమా సెప్టెంబర్‌ 28న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేసారు మేకర్స్. ఆ ఈవెంట్ లో అప్పుడే మూడో సీక్వెల్‌పై కూడా క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు పి. వాసు. `చంద్రముఖి 3` కూడా ఉంటుందని ఆయన తెలిపారు.

`చంద్రముఖి 2` చివర్లో ఆ విషయాన్ని తాము చూపించామని, వడివేలు పాత్రతో ఆ ట్విస్ట్ చూపించినట్టు ఆయన తెలిపారు. చివర్లో `వామ్మో మళ్లీ వచ్చిందా` అంటూ ఆయన చెప్పే డైలాగ్‌ తో సీక్వెల్‌పై హింట్‌ ఇచ్చినట్టు దర్శకుడు పి. వాసు తెలిపారు.అయితే ఇందులో రజనీకాంత్‌ నటించే అవకాశం ఉందా…అనే ప్రశ్నకి స్పందిస్తూ, రజనీ సార్‌ `ఇందులో మీరు కావాలంటే` ఆయన చేయడానికి సిద్ధంగానే ఉంటారని ఆ కథకి తగ్గట్టుగా తాము ప్లాన్‌ చేస్తామని చెప్పారు.అది కూడా ఈ సినిమా ఫలితాన్ని బట్టి ఉంటుందని ఆయన తెలిపారు.అలాగే `చంద్రముఖి2` సినిమాని వాయిదా వేయడంపై దర్శకుడు వాసు మాట్లాడుతూ, సినిమాని డీఐ వర్క్ కి పంపించామని ఆ సమయంలో దాదాపు 400 షాట్స్ కనిపించడం లేదని టెక్నికల్‌ టీమ్‌ చెప్పారు. దీంతో టీం అంతా షాక్‌ అయ్యాం. దాన్ని వెతకడం కాస్త కష్టం తో కూడిన పని.. ఈ వార్త చిత్ర యూనిట్ ని టెన్షన్‌ పెట్టింది. దీంతో చేసేదేం లేక వాయిదా సినిమాను వాయిదా వేశామని ఆయన తెలిపారు.

Exit mobile version