NTV Telugu Site icon

Viral Video: రోడ్డుపై మృత్యువును ధిక్కరించే స్టంట్.. తిన్నది అరగడం లేదంటూ నెటిజన్లు ఫైర్..!

Stunt

Stunt

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం యువకులు ప్రాణాలకు తెగించి స్టంట్స్ చేస్తున్నారు. ఎంత ఎక్కువ వైరేటీగా చేస్తే.. అంతా లైక్ లు వస్తాయని వీడియోలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కార్లపై పుష్ అప్స్, ట్రైన్ వస్తుండగా సెల్ఫీ తీసుకోవడం ఇలాంటివి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరలయ్యాయి. మరోవైపు ఆ వీడియోలు చూసిన కొందరు జనాలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏంటా పైత్యం.. తిన్నది అరగడం లేదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం ఎంతటి దానికైనా సిద్ధపడుతున్నారు.

Read Also: Stray Dogs : వీధి కుక్కల స్వైర విహారం.. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్‌పై దాడి..

తాజాగా యునైటెడ్ స్టేట్స్‌లో ఓ యువకుడు చేసిన వీడియో అందరి మతిపోగుడుతుంది. హార్ట్ ఎటాక్ ఉన్నవారు ఈ వీడియో చూడకపోవడం అత్యంత మంచింది. ఆ వీడియోలో ఓ యువకుడు చేసిన స్టంట్ మ్యత్యువును ధిక్కరించే విధంగా ఉంది. రోడ్డుపై స్పీడ్ గా వస్తున్న ఓ ట్రక్కుకు ఎదురెళ్లి బొక్క బోర్ల పడుకుంటాడు.. అతను ట్రక్కు మధ్య భాగంలో ఉండే స్థలంలో పడుకునేసరికి అది వెళ్లిపోతుంది. అయితే వెంటనే లేచి వద్దామనుకునేసరికి.. దాని వెనుకాలే మరో ట్రక్కు వస్తుండటంతో.. అదృష్టవశాత్తు ఆ ట్రక్కు నుండి యువకుడు తప్పించుకుంటాడు.

Read Also: Delhi: ఢిల్లీ రోడ్లపై బైక్-టాక్సీలు నడపకూడదు.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

అయితే ఆ యువకుడు చేస్తున్న స్టంట్ ను చిత్రీకరించడానికి మరో యువకుడు పక్కన నిలబడి వీడియో తీస్తాడు. నేను ట్రక్ నుంచి తప్పించుకున్నానంటూ అక్కడున్న తన ఫ్రెండ్ కు హై-ఫైవ్ ఇస్తాడు. ఇప్పుడు ఈ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 26 సెకన్ల ఈ వీడియో మే 14న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి దాదాపు 519.8 వేల మంది వీక్షించారు. అంతేకాకుండా ఈ వీడియోపై కొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ యువకుడు చేసిన అత్యంత ప్రమాదకరమైన స్టంట్ మొదటిసారి చూసిన వారికి గూస్‌బంప్‌లను తెప్పిస్తుందంటున్నారు. అలా చేయడం పిచ్చి, పైత్యం అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.