Site icon NTV Telugu

Kavitha: పరిగణనలోకి అనుబంధ ఛార్జ్‌షీట్‌.. జూన్ 3న కోర్టుకు కవిత

Delhi

Delhi

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో భాగంగా బుధవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో బుధవారం  విచారణ జరిగింది. ఈనెల 10న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో కవిత, చరణ్‌ ప్రీత్‌, దమోదర్‌ శర్మ, ప్రిన్స్‌ కుమార్‌, అరవింద్‌ సింగ్‌ను నిందితులుగా ఈడీ పేర్కొంది. ప్రస్తుతం కవిత, చరణ్‌ప్రీత్‌ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. కవిత, చరణ్‌ప్రీత్‌కు ప్రొడక్షన్‌ వారెంట్లు జారీ చేసిన న్యాయస్థానం.. తదుపరి విచారణ జూన్‌ 3న నిందితుల్ని హాజరుపర్చాలని ధర్మాసనం ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Rajasingh: మరోసారి బెదిరింపు కాల్స్.. సీఎం నెంబర్ ఇచ్చాను

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం పలుమార్లు ఈడీ కస్టడీ అనంతరం… జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. ఇక బెయిల్ పిటిషన్లు పలుమార్లు తిరస్కరణకు గురయ్యాయి.

ఇది కూడా చదవండి: Rajasingh: మరోసారి బెదిరింపు కాల్స్.. సీఎం నెంబర్ ఇచ్చాను

Exit mobile version